Advertisement

  • సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న హీరో రామ్ 'రెడ్ '

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న హీరో రామ్ 'రెడ్ '

By: Sankar Sun, 27 Dec 2020 08:55 AM

సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న హీరో రామ్ 'రెడ్ '


తెలుగులో యువ హీరోలలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ సంపాదించుకున్న నటుడు హీరో రామ్ ..ఇస్మార్ట్ శంకర్ సినిమా వరకు లవ్ ఎంటెర్టైనెర్ సినిమాలు చేస్తూ వచ్చిన రామ్ ..ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా తన ఇమేజ్ భారీగా పెంచుకున్నాడు ...ఆ సినిమా భారీ విజయంతో మాస్ లో రామ్ కు మంచి క్రేజ్ ఏర్పడింది...

ఇక రామ్ వచ్చే సంక్రాంతి పండక్కి 'రెడ్' సినిమాతో థియేటర్లలోకి వస్తున్నాడు. సంక్రాంతి కానుకగా జనవరి 14న రెడ్ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. ఈ చిత్రంలో రామ్ సరసన నివేదా పేతురాజ్‌, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌ హీరోయిన్లుగా నటించారు.

తిరుమల కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ స్రవంతి మూవీస్ పతాకం పై ‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికేట్ వచ్చింది. ఇందులో కాస్త వయోలెన్స్‌తో పాటు హీరోయిన్ల గ్లామర్ షో కూడా ఉండటంతో యుకు తోడుగా ఏ కూడా ఇచ్చింది సెన్సార్ బోర్డ్.

ఇక తమిళంలో విజయం సాధించిన థ్రిల్లర్ తడమ్‌కు రీమేక్ ఇది. రామ్ ఇందులో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా కూడా అదే విధంగా అద్భుతం చేస్తుందని నమ్ముతున్నాడు రామ్..

Tags :
|
|

Advertisement