Advertisement

ఎఫ్‌సీయూకే లో హీరో ఫ‌స్ట్ లుక్‌ రిలీజ్...!

By: Anji Tue, 29 Dec 2020 12:09 PM

ఎఫ్‌సీయూకే లో హీరో ఫ‌స్ట్ లుక్‌ రిలీజ్...!

శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్ నుంచి వ‌స్తోన్న 14వ చిత్రం 'ఎఫ్‌సీయూకే (ఫాద‌ర్‌-చిట్టి-ఉమా-కార్తీక్‌)'. ఇటీవ‌ల విడుద‌ల చేసిన జ‌గ‌ప‌తిబాబు (ఫాద‌ర్‌), బేబీ స‌హ‌శ్రిత (చిట్టి), హీరోయిన్ అమ్ము అభిరామి (ఉమా) ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ల‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.

తాజాగా మంగ‌ళ‌వారం చిత్ర బృందం టైటిల్‌కు సంబంధించి చివ‌రిదైన హీరో ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది. చిత్రంలో హీరో కార్తీక్‌ పాత్ర‌ను రామ్ కార్తీక్‌ పోషిస్తున్నారు. పోస్ట‌ర్‌లో హ్యాండ్స‌మ్‌గా క‌నిపిస్తోన్న ఆయ‌న లుక్ ఆస‌క్తిక‌రంగా అనిపిస్తోంది.

అంత‌కు మించి ’ అనే ట్యాగ్‌లైన్ మ‌రింత క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. చిత్రంలో ఆ పాత్ర ఎలా ఉంటుందోన‌ని ఊహించుకుంటూ, దాని గురించి మ‌రింత తెలుసుకోవాల‌నే ఇంట‌రెస్ట్ క‌లిగిస్తోంది ఆ లుక్‌.

అయితే రాబోయే పోస్ట‌ర్లు, ట్రైల‌ర్ల ద్వారా కార్తీక్ క్యారెక్ట‌ర్ గురించి మ‌రింత‌గా తెలుస్తుంద‌ని ఊహించ‌వ‌చ్చు. ఇప్ప‌టికైతే పోస్ట‌ర్‌ ప్ర‌కారం కార్తీక్ క్యారెక్ట‌ర్ సూప‌ర్ కూల్ లుక్స్‌తో, సూప‌ర్ రొమాంటిక్‌గా ఉంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఎప్ప‌టిక‌ప్పుడు విల‌క్ష‌ణ‌మైన‌, వైవిధ్య‌మైన చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తూ, ఎన్నో సూప‌ర్‌హిట్స్‌ను అందిస్తోన్న శ్రీ రంజిత్ మూవీస్ బ్యాన‌ర్‌, ఇప్పుడు మ‌రింత విల‌క్ష‌ణ‌, భిన్న త‌ర‌హా క‌థ‌తో 'ఎఫ్‌సీయూకే'ను నిర్మిస్తోందనేది నిజం.

Tags :

Advertisement