Advertisement

  • రాజశేఖర్ ఆరోగ్యం...ఐసీయూలో నాన్‌ ఇన్‌వాసివ్‌ వెంటిలేటర్‌పై చికిత్స

రాజశేఖర్ ఆరోగ్యం...ఐసీయూలో నాన్‌ ఇన్‌వాసివ్‌ వెంటిలేటర్‌పై చికిత్స

By: Anji Wed, 28 Oct 2020 04:59 AM

రాజశేఖర్ ఆరోగ్యం...ఐసీయూలో నాన్‌ ఇన్‌వాసివ్‌ వెంటిలేటర్‌పై చికిత్స

కరోనా మహమ్మారి ఎవర్ని వదిలిపెట్టడం లేదు. ముఖ్యముగా సినీ, రాజకీయనేతలు ఎక్కువ సంఖ్యలో పడుతుండడం కార్య కర్తల్లో , అభిమానుల్లో కలవరపెడుతుంది.

ఇక చిత్ర సీమా విషయానికి వస్తే ఇప్పటికే అగ్ర దర్శకులు , నిర్మాతలు , నటి నటులు దీనిబారిన పడగా..కొంతమంది క్షేమంగా బయటపడ్డారు. మరికొంతమందికి దీనికి బలయ్యారు.రాజశేఖర్‌, ఆయన కుటుంబం కూడా కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం రాజశేఖర్ ఐసీయూలో నాన్‌ ఇన్‌వాసివ్‌ వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్స్ తెలిపారు. అలాగే చికిత్సలో భాగంగా ఆయనకు ముఖ్యమైన ప్లాస్మా థెరపీని కూడ అందించామని, రాజశేఖర్ చికిత్సకు స్పందిస్తున్నారని, ఆయన కండిషన్ నిలకడగానే ఉందని వెల్లడించారు.

మరోవైపు కరోనా నుంచి కోలుకున్న ఆయన సతీమణి జీవితా రాజశేఖర్ ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

Tags :

Advertisement