Advertisement

  • సీఎం కెసిఆర్ ను పెళ్ళికి ఆహ్వానించిన నితిన్

సీఎం కెసిఆర్ ను పెళ్ళికి ఆహ్వానించిన నితిన్

By: Sankar Mon, 20 July 2020 7:04 PM

సీఎం కెసిఆర్ ను పెళ్ళికి ఆహ్వానించిన నితిన్



ఈ కరోనా సమయంలో తెలుగు ఇండస్ట్రీలో వరుసగా యువ కథానాయకుల పెళ్లిళ్లు జరుగుతున్నాయి ..ఇప్పటికే హీరో నిఖిల్ పెళ్లి అయిపొయింది ..మరోవైపు దగ్గుపాటి రానా పెళ్లి పనులు జరుగుతున్నాయి ..ఇక లిస్ట్ లో ఉన్నమరొక స్టార్ హీరో నితిన్ కూడా ఓ ఇంటివాడు అవుతోన్న సంగతి తెలిసిందే. ప్రేయసి షాలినిని ఆయన వివాహం చేసుకుంటున్న విషయం విదితమే. నాగర్ కర్నూల్‌కు చెందిన డాక్టర్‌ సంపత్‌ కుమార్‌, డాక్టర్ నూర్జహాన్ దంపతుల కుమార్తె షాలినితో ఫిబ్రవరి నెలలో పెద్దలు వివాహం నిశ్చయించారు. ఫిబ్రవరి 15న నితిన్‌, షాలినిల పసుపు, కుంకుమ ఫంక్షన్ జరిగింది. ఏప్రిల్ 16న దుబాయ్‌లో వీరి వివాహం జరపాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కాకపోతే కరోనా వైరస్ వీరి ప్రణాళికలను దెబ్బతీసింది..

కరోనా వైరస్ వల్ల లాక్‌డౌన్ విధించడంతో నితిన్, షాలినిల వివాహాన్ని వాయిదా వేశారు. సుమారు నాలుగు నెలలు వాయిదా పడిన ఈ వివాహ వేడుక తేదీని ఎట్టకేలకు ఖరారు చేశారు. ఈనెల 26న నితిన్ పెళ్లి జరగబోతోంది. ఈ వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. హీరో నితిన్ తన తండ్రి సుధాకర్ రెడ్డితో కలిసి ప్రగతి భవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌ను కలిశారు. శుభలేఖను కేసీఆర్‌కు అందజేశారు. తన వివాహానికి హాజరై ఆశీర్వదించాలని కోరారు. తాను వస్తానని కేసీఆర్ హామీ ఇచ్చినట్టు సమాచారం.

హైదరాబాద్‌లో 26వ తేదీ రాత్రి 8.30 గంటలకు షాలినితో కలిసి ఏడడుగులు వేయబోతున్నారు నితిన్. ప్రస్తుతం హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి నితిన్, షాలిని వివాహ వేడుకను నిర్వహించ‌నున్నారు. ఈ వేడుక‌కు కేవ‌లం ఇరు కుటుంబాల‌తో పాటు స‌న్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజ‌ర‌ుకానున్నారు

Tags :
|
|

Advertisement