Advertisement

  • ఫలక్‌నామా ప్యాలెస్‌లో ఈ నెల 26న నితిన్ పెళ్లి ..

ఫలక్‌నామా ప్యాలెస్‌లో ఈ నెల 26న నితిన్ పెళ్లి ..

By: Sankar Wed, 22 July 2020 4:47 PM

ఫలక్‌నామా ప్యాలెస్‌లో ఈ నెల 26న నితిన్ పెళ్లి ..



టాలీవుడ్ లో యువ హీరోలు అందరూ ఒకరి తర్వాత ఒకరు పెళ్లి బాట పడుతున్నారు ఇప్పటికే నిఖిల్ పెళ్లి చేసుకోగా , రానా పెళ్లి పనులు జరుగుతున్నాయి , ఇక మరొక యువ హీరో నితిన్ కూడా పెళ్లి పీటలు ఎక్కుతున్నాడు ..కరోనా లేకుంటే ఎప్పుడో పెళ్లి అయిపోయేది కానీ కరోనా రావడంతో పెళ్లి వాయిదా పడింది ..నిఖిల్ లాక్ డౌన్ టైంలోనే పెళ్లి చేసుకోగా , నితిన్ మాత్రం కరోనా తగ్గుతది అని వెయిట్ చేసాడు ..అయితే కరోనా ఇప్పట్లో తగ్గే అవకాశం లేకపోవడంతో నితిన్ కూడా ఇక మామూలుగానే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు ..

నితిన్‌, షాలినిల ఎంగేజ్‌మెంట్‌ ఈ రోజు హైదరాబాద్‌లో షాలిని ఇంటిదగ్గర సింపుల్‌గా జరిగింది. నితిన్‌, షాలినిల కుటుంబసభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ ఇద్దరి వివాహ వేడుక ఈ నెల 26న ఉదయం 8గంటల 30 నిమిషాలకు ఫలక్‌నామా ప్యాలెస్‌లో జరగనుంది. ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి ఈ వివాహం జరగనుంది.

ఐదు రోజుల పాటు జ‌ర‌గ‌నున్న పెళ్ళి సంబురాలకి కేవ‌లం కుటుంబ స‌భ్య‌లు మాత్ర‌మే పాల్గొన‌నున్నార‌ట‌. ఇక వివాహానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి సీఎం కేసీఆర్‌తో పాటు ప‌వ‌న్ క‌ళ్యాణ్ , త్రివిక్ర‌మ్‌తో పాటు పలువురు ప్ర‌ముఖులు హాజ‌రు కానున్న‌ట్టు తెలుస్తుంది.కాగా, ఫిబ్ర‌వ‌రిలో నితిన్‌, షాలినిల ప‌సుపు, కుంకుమ వేడుక జ‌రిగిన విష‌యం విదిత‌మే.

Tags :

Advertisement