Advertisement

నేచురల్ స్టార్ నాని 'అంటే సుందరానికి'...!

By: Anji Sat, 21 Nov 2020 9:52 PM

నేచురల్ స్టార్ నాని 'అంటే సుందరానికి'...!

నేచురల్ స్టార్ నాని 28వ సినిమా టైటిల్ ఏంటో తెలిసిపోయింది. 'అంటే సుందరానికి' పేరు పెట్టినట్లు చిత్రబృందం శనివారం, కర్టెన్ రైజర్ వీడియోను ట్వీట్ చేసింది.

ఇందులో సుందరం పాత్రలో నవ్వించేందుకు సిద్ధమవుతున్నారు నాని. 'లవ్ లైక్ నెవ్వర్ భిఫోర్.. లాఫ్ లైక్ నెవ్వర్ బిఫోర్' అనే క్యాప్షన్ను కూడా జోడించారు.

ఈ వీడియోలో పంచెకట్టు, చొక్కాతో వెనక్కు తిరిగి ఉన్న నాని ఫోజ్ ఆకట్టుకుంది. అలానే టైటిల్ వెనక వైపు కనిపించిన లేడీస్ సైకిల్, వీణ, పచ్చళ్ల జాడీలు, జాతక చక్రం, షూస్ ఆసక్తిని పెంచుతున్నాయి.

ఈ సినిమాతో నజ్రియా నజీమ్.. తెలుగు తెరకు పరిచయం కానుంది. వివేక్ సాగర్ సంగీతమందిస్తుండగా, వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభమై, వచ్చే ఏడాది థియేటర్లలోనే విడుదల చేయనున్నారు.

Tags :

Advertisement