Advertisement

వెబ్ సిరీస్ తీయనున్న స్టార్ దర్శకుడు

By: Sankar Tue, 06 Oct 2020 2:21 PM

వెబ్ సిరీస్ తీయనున్న స్టార్ దర్శకుడు


రవితేజ తో కలిసి 'మిరపకాయ్' సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన హరీష్ శంకర్ ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి గబ్బర్ సింగ్ సినిమా తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఇక ఆ తరవాత వరుసగా సినిమాలు చేసిన హరీష్ శంకర్ తాజాగా మరో సారి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సిద్దమైపోయాడు.

గత ఏడాది ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు హరీష్. ఈ సినిమా 14 రీల్స్ పతాకం పై తెరకెక్కింది. తాజాగా మరోసారి 14 రీల్స్ తో వర్క్ చేయడానికి రెడీ అయ్యాడు.. ఇదిలా ఉంటే హరీష్ ఆహా కోసం రంగంలోకి దిగితున్నాడని తెలుస్తుంది. సీనియర్ పూరి జగన్నాథ్ తరహాలోనే ఆయన డిజిటల్ బాట పట్టేస్తున్నారు. హరీష్ శంకర్ ఆహో కోసం రంగంలోకి దిగారని వెబ్ ఫిల్మ్ చేస్తున్నారని తెలిసింది. ఇందుకోసం కోసం స్క్రిప్ట్ కూడా రాసారట.

త్వరలో ఈ మూవీని అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం నిర్మాత బన్నీ వాస్ తో హరీష్ చేతులు కలుపుతున్నారని ఫిలింనగర్ వర్గాలు ముచ్చటిస్తున్నాయి. మరి.. ఇందులో ఎవరు నటించనున్నారో.. జోనర్ ఏంటో తెలియాల్సి ఉంది.

Tags :
|

Advertisement