Advertisement

  • లేడీ అమితాబ్ విజయశాంతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

లేడీ అమితాబ్ విజయశాంతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు

By: Sankar Wed, 24 June 2020 11:47 AM

లేడీ అమితాబ్ విజయశాంతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు



తెలుగు సినిమాల్లో హీరోకి ఉన్న ప్రాధాన్యత హీరోయిన్ కు ఉండదు ..జనాలు కూడా హీరోని చూసే సినిమా చూడటానికి వస్తారు ..ఒక్కపుడు అయినా అంతో ఇంతో హీరోయిన్లకు ప్రాధాన్యత ఉండేది కానీ ఇప్పుడు మాత్రం కేవలం పాటలకోసమే అన్నట్లు తయారు అయింది ..అయితే హీరో ఎవరు లేదా దర్శకుడు ఎవరు ఇంకా అంటే ప్రొడ్యూసర్ ఎవరు ఇలా వాళ్ళని మాత్రమే ప్రేక్షకులు చూస్తున్నారు ..కానీ ఇలాంటి ఇండస్ట్రీలో కూడా కేవలం తనను చూడటం కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలా ఒక హీరోయిన్ చేయగలిగింది ..తనకు మాత్రమే ప్రత్యేక కథలు రాసేలా , కేవలం తాను నటిస్తే బంపర్ విజయాలు సాధించేలా చేయగలిగిన నటి తెలుగులో ఒకరు ఉన్నారు ..ఆమె లేడీ అమితాబ్ విజయశాంతి ..ఈ రోజు ఈ లేడీ సూపర్ స్టార్ పుట్టిన రోజు ..

1966 జూన్ 24న వరంగల్‌లో జన్మించిన విజయశాంతి.. తన పిన్ని విజయలలిత వారసత్వంతో ఏడేళ్ల వయసులోనే బాల నటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ‘కిలాడీ కృష్ణుడు’తో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన విజయశాంతి ఆ తరువాత వెనుతిరిగి చూసుకోకుండా వరుస చిత్రాల్లో నటించింది. 1991లో ‘కర్తవ్యం’ సినిమాలో నటనకు గానూ జాతీయ సినిమా ఉత్తమ నటి పురస్కారాన్ని అందుకుంది విజయశాంతి.

టాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి-విజయశాంతి హిట్ కాంబినేషన్‌లో పలు విజయవంతమైన చిత్రాలు నేటికీ తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నాయి. మెగాస్టార్‌తో కలిసి 19 చిత్రాల్లో కథానాయికగా నటించిన విజయశాంతి. ఇక నందమూరి బాలకృష్ణ‌తో 17 చిత్రాల్లో నటించింది. వెంకటేష్, నాగార్జునలతో సైతం ఆడిపాడిన విజయశాంతి నటనతోనే కాదు.. పారితోషికం విషయంలోనూ హీరోలతో పోటీ పడుతూ అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న నటిగా పేరుగడించింది.ఇటీవలే మళ్ళీ చాలా కాలం విరామం తర్వాత మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమాతో రి ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి మళ్ళీ అభిమానులను అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు


Tags :
|

Advertisement