Advertisement

  • నీ దూకుడు సాటెవ్వరూ ..హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ మహేష్ బాబు

నీ దూకుడు సాటెవ్వరూ ..హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ మహేష్ బాబు

By: Sankar Sun, 09 Aug 2020 07:53 AM

నీ దూకుడు సాటెవ్వరూ ..హ్యాపీ బర్త్ డే సూపర్ స్టార్ మహేష్ బాబు



సూపర్ స్టార్ మహేష్ బాబు ..తెలుగు సినీ ఇండస్ట్రీ లో ఈ పేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ..సూపర్ కృష్ణ నట వారసుడిగా రాజకుమారుడు సినిమాతో దిగ్గజ దర్శకుడు రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెలుగు సినిమాకు పరిచయం అయిన మహేష్ ఒక్కో అడుగు ఎక్కుతూ ఇప్పుడు తెలుగులో నెంబర్ వన్ హీరో స్థానానికి అతి చేరువలో ఉంది తన తండ్రి కృష్ణ గారినే మించిపోయాడు ..

తొలుత లవర్ బాయ్ పాత్రలతో కేవలం ఫామిలీ ఆడియన్స్ లో ఫాలోయింగ్ తెచ్చుకున్న మహేష్ కెరీర్ దరింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి కి ముందు పోకిరి తర్వాత అని చెపుకోవచ్చు ..పోకిరి కంటే ముందు ఒక్కడు , అతడు వంటి బ్లాక్బూస్టర్ సినిమాలు ఉన్నప్పటికీ పోకిరి సినిమాతో మాస్ లో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు ..ఇక అక్కడి నుంచి వెనుతిరిగిచూడాల్సిన అవసరం లేకుండా పోయింది ..

దూకుడు , బిజినెస్ మాన్ వంటి సినిమాలతో అగ్రస్థానానికి చేరుకున్న మహేష్ ఎస్వీఎస్సీ, శ్రీమంతుడు , భరత్ అనే నేను , సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాలతో తన స్థాన్నాన్నీ మరింత పదిలం చేసుకున్నాడు ..మధ్య మధ్యలో బ్రమోత్సవం , ఆగడు, స్పైడర్ వంటి అపజయాలు పలకరించినప్పటికీ మహేష్ వాటిని సమర్థవంతంగా ఎదురుకొన్నాడు ..

కేవలం సినిమాలు మాత్రమే కాకుండా సమాజ సేవలో కూడా మహేష్ ముందు ఉంటాడు ..తన సినిమాల ద్వారా సమాజానికి మంచి మెసేజ్ ఇస్తూనే, తాను కూడా సామజిక సేవలో పాలుపంచుకుంటున్నారు ..చిన్న పిల్లలకు హార్ట్ ఆపరేషన్లు చేయించడం , ఊరును దత్తత తీసుకోవడం వంటి వాటితో రియల్ హీరో అనిపించుకున్నారు ..

ఈ రోజు ఆగష్టు 9 మహేష్ బాబు పుట్టిన రోజు , సూపర్ స్టార్ అభిమానులందరికి పండుగ రోజు ..సాధారణంగా అయితే ఈరోజు అభిమానులు తమ అభిమాన హీరో బర్త్ డే ను ఘనంగా జరిపేవారు ..కానీ కరోనా పరిస్థితుల వలన మహేష్ తన అభిమానులకు ఒక సందేశాన్ని పంపించాడు .. తన పుట్టిన రోజు సందర్భంగా కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు ..ప్రస్తుతం సర్కారీ వారి పాట సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు గారికి అయన అభిమానులందరి తరుపున పుట్టినరోజు శుభాకాంక్షలు ..

Tags :
|

Advertisement