Advertisement

హ్యాపీ బర్త్ డే లెజెండరీ సింగర్ యస్పీబీ

By: Sankar Thu, 04 June 2020 1:58 PM

హ్యాపీ బర్త్ డే లెజెండరీ సింగర్ యస్పీబీ


తెలుగులోనే కాకుండా సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో లెజెండరీ గాయకుల లిస్ట్ లో మొదటి స్థానం లో ఉండే వ్యక్తి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ..ఎన్నో సంవత్సరాలుగా తన మధుర గానంతో ఎన్నో వేల కొలది పాటలకు ప్రాణం పోసాడు..ముఖ్యంగా తెలుగు లో సీనియర్ ఎన్టీఆర్ , నాగేశ్వరావు , కృష్ణ , చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున, వెంకటేష్ వంటి అగ్రతారలకు ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఇచ్చిన దిగ్గజం యస్పీబీ..

sp balasubramanyam,balu,legend,telugu,tamil ,ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎన్టీఆర్ , నాగేశ్వరావు , కృష్ణ , చిరంజీవి, లెజెండరీ ,  సాంగ్స్

ఆయన 73వ బర్త్‌డే సందర్భంగా ట్విటర్‌ వేదికగా ఆయన అభిమానులు శుభాకాంక్షలతో హోరెత్తించారు. అభిమాన గాయకుడికి పలువురు ప్రముఖులు, అభిమానులు పెద్దసంఖ్యలో శుభాకాంక్షలు తెలుపడంతో ట్విటర్‌ టాప్‌ ట్రెండ్స్‌లో నిలిచింది. బాలుగా పేరొందిన సుప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో వేలాది పాటలకు సుమధుర గాత్రంతో ప్రాణం పోశారు.

తన సుదీర్ఘ కెరీర్‌లో ఆయన ఆరు జాతీయ ఫిల్మ్‌ అవార్డులు, 25 సార్లు ఏపీ ప్రభుత్వ నంది అవార్డులను సొంతం చేసుకున్నారు. బాలీవుడ్‌ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును, ఆరు దక్షిణాది ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులను కైవసం చేసుకున్నారు. ఇక 2001లో ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు, 2011లో పద్మవిభూషణ్‌ అవార్డు ఆయనను వరించాయి.


Tags :
|
|
|

Advertisement