Advertisement

జిఎస్‌టి మూవీ లోగో పోస్ట‌ర్ లాంచ్‌...!

By: Anji Thu, 15 Oct 2020 1:39 PM

జిఎస్‌టి మూవీ లోగో పోస్ట‌ర్ లాంచ్‌...!

తోలుబొమ్మ‌ల సిత్రాలు బ్యాన‌ర్ పై కొమారి జాన‌కిరామ్ ద‌ర్శ‌క‌త్వంలో కొమారి జాన‌య్య‌నాయుడు నిర్మిస్తున్న చిత్రం జిఎస్‌టి (god saithan technology). ఈ చిత్ర లోగో పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ సినీజోష్ ఆఫీస్ లో లాంచ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో ద‌ర్శ‌కుడు జాన‌కిరామ్ మాట్లాడారు... తోలు బొమ్మ‌ల సిత్రాలు బ్యాన‌ర్ పై ఈ చిత్రం లోగోను లాంచ్ చేయ‌డం ఆనందంగా ఉంది అన్నారు. నేను మొద‌ట్లో ద‌ర్శ‌క‌త్వ శాఖ‌లో అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేశాను.

జిఎస్‌టి నా మొద‌టి చిత్రం. నేను విద్యార్ధి ద‌శ‌లో ఉన్న‌ప్ప‌టినుంచి నా మ‌దిలో మెలుగుతున్న ఆలోచ‌న ఇది. దేవుడు, దెయ్యం, సైన్స్ వీటికి సొల్యూష‌న్ దొర‌క‌డం లేదు. ఏది నిజం ఏది అబద్ధం అని నా మ‌దిలో మెదిలే ప్ర‌శ్న ఇది.

ఆ కోవ‌లోనే ఎన్నో దేవాల‌యాలు, ఎన్నో స్మ‌శానాలు అలాగే ఎంతో టెక్నాల‌జీ గురించి రీసెర్చ్ చేసి చేసిన చిత్ర‌మిది. ఇక ఎన్నో వంద‌ల సంవ‌త్స‌రాల నుంచి ఎప్పుడూ ఏదో ఒక జ‌బ్బు వ‌చ్చి ఎంతో మంది చ‌నిపోతున్నారు. ప్ర‌స్తుతం క‌రోనా వ‌చ్చింది.

ప్ర‌తి దానికి ఏదో ఒక వ్యాక్సిన్ క‌నుక్కున్నారు. కానీ ఈ స‌మ‌స్య‌కు మాత్రం వాక్సిన్ అనేది లేదు. దేవుడు వ‌ర్సెస్ సైతాన్ ఇందులో ఏముంది అని రీసెర్చ్ చేసి అందులోంచి క‌థ‌ను రెడీ చేసుకున్నాను. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు నచ్చే విధంగా క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌ను జోడించి ఈ చిత్రాన్ని చేయ‌డం జ‌రిగింది. అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా మొద‌లైన ఈ ప్ర‌యాణం డైరెక్ట‌ర్ వ‌ర‌కు వెళ్ళింది. ప్రేక్ష‌కులు ఈ చిత్రాన్ని ఆదిరించాల‌ని కోరుకుంటున్నాను అన్నారు.

జూనియ‌ర్ సంపు అమ‌ర్‌నాధ్ మాట్లాడుతూ... దేవుడు, దెయ్యం, సైన్స్ ఫిక్ష‌న్‌కి సంబంధించిన ఎన్నో చిత్రాలు వ‌చ్చాయి. కానీ ఇది కొత్త కాన్సెప్ట్ చిత్రం. అన్ని హంగులు క‌ల‌గ‌లిపిన చిత్ర‌మే జిఎస్‌టి జ‌రిగిన‌దాన్ని చూపించ‌డం ఇతిహాసం అంటారు. ఒక క‌థ‌ని పురాణంలా చెప్పారు.

పెద్ద‌ ద‌ర్శ‌కుల స్టైల్లో ఉంటుంది ఆయ‌న టేకింగ్ చాలా బావుంటుంది. ఈ చిత్రంలో చాలా రిస్కీ షాట్స్ ఎక్కువ‌గా ఉన్నాయి. ఒక‌ర‌కంగా చెప్పాలంటే చిన్న బాహుబ‌లి చిత్రం తీసిన‌ట్లు తీశాం. మా ఈ చిత్రాన్ని అంద‌రూ చూసి ఆద‌రించండి.

gst movie logo poster launched,gst movie,gst movie logo poster launch,rgv gst movie,gst movie logo poster launch pressmeet,poster launch,chembur naka movie poster,rgv new movie,gst hindi movie music launch,rgv movies,oxygen movie audio launch,oxygen movie audio launch live,rgv latest movie,chiranjeevi launches indrasena movie first look,gst movie trailer,latest 2020 movie trailers,jayadev movie posters controversy,latest telugu movie trailers 2020,latest telugu movies

పూజా హీరోయిన్ మాట్లాడుతూ... ఇందులో నా పాత్ర తెలంగాణ యాస్ మాట్లాడే అమ్మాయి. చాలా బావుంటుంది. నాకు నా పాత్ర బాగా న‌చ్చింది. డైరెక్ట‌ర్‌ గారు చాలా మంచి వారు నాకు ఎక్క‌డ ఎటువంటి డౌట్ వ‌చ్చినా ఎంతో నిధానంగా చెప్పేవారు.

ఎప్పుడూ విసుక్కునేవారు కాదు. చాలా కూల్ మైండ్‌తో ప‌నిచేసేవారు. సైన్స్‌లో తెలియ‌ని కొత్త విష‌యాలు తెలుస్తాయి. ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ.


ఇందు హీరోయిన్ మాట్లాడుతూ... క‌థ‌ని మాకు డైరెక్ట‌ర్‌గారు ఎలాగైతే చెప్పారో తియ్య‌డం కూడా అలానే తీశారు. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. క‌రోనా వ‌ల్ల ఈ చిత్రం రావ‌డం లేట్ అయింది. లేదంటే ఎప్పుడో వ‌చ్చేది. గ‌తంలో వ‌చ్చిన జిఎస్‌టి చిత్రానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. ఈ చిత్రం ఎప్పుడు విడుద‌ల అవుద్దా అని మీ అంద‌రితో పాటు నేను కూడా ఎదురుచూస్తున్నా అన్నారు.

స్వాతి మండ‌ల్ హీరోయిన్ మాట్లాడుతూ... డైరెక్ట‌ర్ చాలా మంచివారు. ప్ర‌తిఒక్క‌రినీ చ‌క్క‌గా కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళేవారు. ఈక‌థ ఒక యూనిక్ స్టోరీ. జానకిగారిద‌గ్గ‌ర నేను చాలా నేర్చుకున్నాను. ఆయ‌న‌కి ఓర్పు చాలా ఎక్కువ‌.

ఈ చిత్రంలో లొకేష‌న్స్ అన్నీ చాలా బావుంటాయి. ఇందులో మ‌సాలా, యాక్ష‌న్‌, రొమాన్స్ అన్నీ ఉంటాయి. నాకు భ‌విష్య‌త్తులో జాన‌కిరామ్‌గారితో ఇంకా మ‌రిన్ని చిత్రాలు చెయ్యాల‌ని ఉంది అన్నారు.


హీరో అశోక్ మాట్లాడుతూ... సినిమా మొత్తానికి క‌థే హీరో. ఇందులో హీరో, విల‌న్‌, హీరోయిన్ అలా పాత్ర‌ల‌కంటే క‌థే మెయిన్ పాత్ర పోషిస్తుంది. ద‌ర్శ‌కులు జాన‌కిరామ్‌గారి లాంటి వారు ఇండ‌స్ట్రీలో ఉండ‌డం వ‌ల్ల కొత్త వాళ్ళ‌కు అవ‌కాశాలు దొరుకుతాయి. ఆయ‌న‌తో క‌లిసి ఇంకా భ‌విష్య‌త్తులో సొంతంగా సినిమాలు నిర్మించి చేయాల‌నుంది అన్నారు.

ఆర్టిస్ట్స్:

హీరోలుః ఆనంద్‌కృష్ణ‌, అశోక్‌, హీరోయిన్స్ః స్వాతి మండ‌ల్‌, యాంక‌ర్ ఇందు, పూజ‌సుహాసిని, స్పెష‌ల్ సాంగ్ హీరోయిన్ః శ‌ష్టివ‌ర్మ‌, కామెడీ క్యారెక్ట‌ర్ః జూనియ‌ర్ సంపు, ఇత‌ర ప్ర‌ధాన తారాగ‌ణంః వెంక‌ట్‌, నందు, వాణి, గోవింద్‌, స్వ‌ప్న‌, వేదం నాగ‌య్య‌, జాన‌ప‌దం అశోక్‌, న‌ల్ల‌సుద‌ర్శ‌న‌రావ్‌.
టెక్నీషియ‌న్స్:

మ్యూజిక్ః యువి. నిరంజ‌న్‌, డిఒపిః డి.యాద‌గిరి, ఎడిటింగ్ః సునీల్‌మ‌హ‌రానా, నిర్మాతః కోమారి జాన‌య్య నాయుడు, కో-డైరెక్ట‌ర్ః రాజ్ కిషోర్ సీర‌మ్‌, క‌థ స్క్రీన్‌ప్లే, మాట‌లు ద‌ర్శ‌క‌త్వంఃకోమారి జాన‌కిరామ్‌, పిఆర్ ఓః మ‌ధు వి.ఆర్‌.

Tags :

Advertisement