Advertisement

  • కొత్త పెళ్లికొడుకు రానా దగ్గుబాటి బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్

కొత్త పెళ్లికొడుకు రానా దగ్గుబాటి బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్

By: chandrasekar Tue, 01 Sept 2020 09:26 AM

కొత్త పెళ్లికొడుకు రానా దగ్గుబాటి బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్


ఇప్పుడే ఒక ఇంటివాడైన రానా దగ్గుబాటి బాలీవుడ్ లో భారీ బడ్జెట్టు సినిమాలో నటించబోతున్నాడు. కొత్త పెళ్లికొడుకు రానా దగ్గుబాటి లేటెస్ట్ గా ఓ బాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మిలింద్ రావ్ దర్శకత్వంలో రూపొందే సినిమాలో రానా హీరోగా నటించబోతున్నాడు. మిలింద్ చెప్పిన కథకు బాగా ఇంప్రెస్ అయిన రానా వెంటనే ఓకే చెప్పేశాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రేక్షకులను అలరించే రీతిలో అతీంద్రియ శక్తుల నేపథ్యంలో సాగే అడ్వెంచరస్ మూవీలో వీఎఫ్ఎక్స్ కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. ఈ చిత్రాన్ని సురేశ్ బాబు, గోపీనాథ్ ఆచంట కలసి సంయుక్తంగా భారీ బడ్జెట్టుతో నిర్మిస్తారు. ఎప్పుడు ప్రారంభమవుతుందో వివరాలు తెలియాల్సి వుంది.

ప్రస్తుతం రానా మల్టీ లాంగ్వేజ్ మూవీ ‘హాథీ మేరే సాథీ’ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. అటు, తెలుగులో సాయిపల్లవితో కలసి ‘విరాట పర్వం’ సినిమాలోనూ రానా నటించబోతున్నాడు.

Tags :

Advertisement