Advertisement

  • ఓటిటి లో గోపీచంద్ సినిమా ఆరడగుల బుల్లెట్ ..?

ఓటిటి లో గోపీచంద్ సినిమా ఆరడగుల బుల్లెట్ ..?

By: Sankar Fri, 19 June 2020 9:35 PM

ఓటిటి లో గోపీచంద్ సినిమా ఆరడగుల బుల్లెట్ ..?



ఆరడుగుల అందగాడు గోపీచంద్ కు ఇప్పుడు టైం సరిగా కలిసి రావడం లేదు ..సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్ పడటం లేదు ,లౌక్యం తర్వాత గోపీచంద్ కు ఆ స్థాయి హిట్ మల్లి రాలేదు ..లౌక్యం కి ముందు కూడా గోపీచంద్ కు సరైన హిట్స్ లేనప్పటికీ లౌక్యం బారి విజయం సాధించడంతో మల్లి హిట్ ట్రాక్ ఎక్కాడు అనుకునేలోపు వరుస అపజయాలతో సతమతమవుతున్నాడు ..ఒక హీరోకి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నప్పటికీ ఎందుకో గోపీచంద్ పరిస్థితి రోజురోజుకి తీసికట్టుగా తయారు అవుతుంది ..

అయితే బి గోపాల్ డైరెక్టర్ గా గోపీచంద్ హీరోగా ఆరడుగుల బులెట్ అనే సినిమా ఎప్పుడో షూటింగ్ అయిపో చేసుకోనీ విడుదల అవ్వాల్సిన టైములో అనుకోని కారణాల వాళ్ళ ఆగిపోయింది ..లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూతబడంతో ఓటీటీ ప్లాట్‌ఫాంలకు ఆదరణ బాగా పెరిగింది. లాక్‌డౌన్‌కు ముందు విడుదల కావాల్సిన సినిమాలు సైతం ఇప్పుడు నేరుగా ఓటీటీలో విడుదలవుతున్నాయి.

ఇలాంటి సమయంలో ‘ఆరడుగుల బుల్లెట్’కు ఓటీటీ నుంచి మంచి ఆఫర్ వచ్చిందట. గతంలో ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ టీవీకి విక్రయించారు. సుమారు రూ.7 కోట్లకు విక్రయించినట్టు సమాచారం.ఇప్పుడు జీ నెట్‌వర్క్‌కు చెందిన ఓటీటీ ప్లాట్‌ఫాం ‘జీ5’ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ కోసం నిర్మాతను సంప్రదించిందట. ఈ సినిమాను జీ5కు విక్రయించి ఆ డబ్బుతో ఫైనాన్షియర్లకు సెటిల్‌మెంట్ చేయాలని నిర్మాత చూస్తున్నారట. ఒకవేళ ఇవన్నీ కుదిరి ఈ సినిమా ఓటీటీలో విడుదల అయితే అటు నిర్మాతకు, ఇటు గోపీచంద్‌కు కాస్త ఊరట లభించినట్టే.


Tags :

Advertisement