Advertisement

  • కర్తవ్యం సీక్వెల్ ఉంటుంది ..కానీ హీరోయిన్ మాత్రం ఆమెనే ..దర్శకుడు గోపి నైనర్

కర్తవ్యం సీక్వెల్ ఉంటుంది ..కానీ హీరోయిన్ మాత్రం ఆమెనే ..దర్శకుడు గోపి నైనర్

By: Sankar Thu, 25 June 2020 6:53 PM

కర్తవ్యం సీక్వెల్ ఉంటుంది ..కానీ హీరోయిన్ మాత్రం ఆమెనే ..దర్శకుడు గోపి నైనర్



నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం కర్తవ్యం ..ఇందులో బోరుబావిలో పడిన చిన్నారిని కాపాడటం, ఓ ఊరి సమస్యల్ని తీర్చడం చుట్టూ ఉత్కంఠగా సాగే సినిమా ఇది..ఈ సినిమాలో నయనతార కలెక్టర్ పాత్రలో నటించింది ..తమిళ్ లో తీసిన ఆరమ్ సినిమాను తెలుగులో కర్తవ్యం పేరుతో రిలీజ్ చేసారు ..

ఆరమ్ కు సీక్వెల్‌ తీయనున్నట్టు నిర్మాత కె.రాజేష్ అప్పట్లో ప్రకటించారు. మరింత శక్తివంతమైన కథ, సోషల్ మెసేజ్‌తో ‘ఆరమ్’ సీక్వెల్ ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, రెండేళ్లు గడిచినా ఈ సీక్వెల్ గురించి మళ్లీ ప్రస్తావన లేకపోవడంతో ఇక ఉండదని అంతా అనుకున్నారు. కానీ, ఈ సీక్వెల్ అంశం తాజాగా వార్తల్లోకి వచ్చింది. ‘ఆరమ్’ సీక్వెల్ ఉంది కానీ.. దానిలో నయనతార నటించడం లేదని వదంతులు వచ్చాయి. నయనతారకు కాల్షీట్లు సర్దుబాటు కావడంలేదని.. దీంతో ఆమె స్థానంలో కీర్తి సురేష్‌ను తీసుకున్నారని కోలీవుడ్‌లో గుసగుసలు వచ్చాయి ..

అయితే, ఈ వార్తలపై తాజాగా దర్శకుడు గోపి నైనర్ స్పందించారు. ‘ఆరమ్ 2’ కోసం కీర్తి సురేష్‌ను సంప్రదించలేదని చెప్పారు. అలాగే, సీక్వెల్ కూడా ఆగదని స్పష్టం చేశారు. ఆరమ్ 2 సినిమాను కేవలం నయనతారతో మాత్రమే నేను చేస్తాను ..మరొకరిని ఆ పాత్రలో ఉహించుకోలేను అని అన్నాడు ..దీంతో ఈ సినిమా వస్తున్న వార్తలకు బ్రేక్ పడింది ...

Tags :
|

Advertisement