Advertisement

  • నాని నటించిన ‘వి’ సినిమా శాటిలైట్ హక్కులను జెమిని టీవీ భారీ ధరకు కొనుగోలు

నాని నటించిన ‘వి’ సినిమా శాటిలైట్ హక్కులను జెమిని టీవీ భారీ ధరకు కొనుగోలు

By: chandrasekar Thu, 17 Sept 2020 07:58 AM

నాని నటించిన ‘వి’ సినిమా శాటిలైట్ హక్కులను జెమిని టీవీ భారీ ధరకు కొనుగోలు


నాని నటించిన ‘వి’ సినిమా శాటిలైట్ హక్కులను జెమిని టీవీ భారీ ధరకు కొనుగోలు చేసింది. గతంలో కొత్త సినిమాలు రిలీజైన చాలా నెలల వరకు టీవీల్లో ప్రసారమయ్యేవి కాదు. కానీ ఇటీవల థియేటర్లలో తీసిన వెంటనే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ వాటిని టెలీకాస్ట్ చేసేస్తున్నాయి. దీనికి తోడు కోట్లు పెట్టి హక్కులు కొనుగోలు చేసుకుంటున్న ఓటీటీ సంస్థలు కొద్దిరోజులకే క్వాలిటీ ఫ్రింట్‌ను ప్రేక్షకులకు అందిస్తున్నాయి.

కొన్ని లోకల్ ఛానల్స్‌ నిబంధనలకు విరుద్ధంగా వీటిని డౌన్‌లోడ్ చేసుకుని ప్రసారం చేస్తుంటాయి. అప్పటికే ఆ సినిమా చాలామంది చూసి ఉంటారు కాబట్టి ఎవరూ పట్టించుకునేవారు కాదు. ప్రస్తుతం కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఇటీవల చాలా సినిమాలు డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్నాయి. ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లి సినిమా చూసే పరిస్థితి లేకపోవడంతో నిర్మాతలు ఓటీటీ, శాటిలైట్ రైట్స్‌నే నమ్ముకుని గట్టెక్కుతున్నారు.

థియేటర్‌ ఎప్పుడు తెరుస్తారో ఇప్పటికి చెప్పలేం కాబట్టి ఓటీటీ క్రేజ్ పెరిగింది. మరోపక్క ఆ సినిమాలో టెలీకాస్ట్‌ చేసేందుకు ఛానల్స్‌ సిద్ధమవుతున్న సమయంలో కొన్ని లోకల్ ఛానళ్లు అక్రమంగా వాటిని టెలీకాస్ట్‌ చేస్తున్నాయి. ఇలాంటి వాటిని ఇన్నాళ్లూ చూసిచూడనట్లు వదిలేసిన పెద్ద ఛానళ్ల యాజమాన్యాలు ఇటీవల కొంచెం సీరియస్ అవుతున్నాయి. ఇటీవల నాని, సుధీర్‌బాబు నటించిన ‘వి’ సినిమా అమెజాన్ ప్రైమ్ ద్వారా రిలీజైన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం ఈ సినిమా శాటిలైట్ హక్కులను జెమిని టీవీ భారీ ధరకు కొనుగోలు చేసింది. అయితే ఇటీవలే హైదరాబాద్‌లోని ఓ లోకల్ ఛానల్‌ ‘వి’ సినిమాను టెలికాస్ట్ చేసింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న జెమిని టీవీ ఆ లోకల్ ఛానల్‌కు నోటీసులు చేసినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా సినిమా టెలికాస్ట్ చేసినందుకు ఏకంగా రూ.2కోట్ల జరిమానా చెల్లించాలని కోరిందట. జెమిని టీవీ తీసుకున్న ఈ నిర్ణయంపై మిగతా ఛానల్స్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఇందువల్ల ప్రేక్షకులు తొందరగా కొత్త సినిమాలను టీవీ లోనే వీక్షించవచ్చు.


Tags :
|
|

Advertisement