Advertisement

Flash News: గంగవ్వ ఆరోగ్యం ఎలా ఉందొ తెలుసా...?

By: Anji Mon, 12 Oct 2020 7:05 PM

Flash News: గంగవ్వ ఆరోగ్యం ఎలా ఉందొ తెలుసా...?

బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక అందరిలో గంగవ్వ ఆరోగ్యం గురించి ఆరా తీస్తున్నారు.యూట్యూబ్ ప్రోగ్రాంతో ఫుల్ ఫేమ‌స్ అయిన గంగ‌వ్వ బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అర‌వై ఏళ్ళ వ‌య‌స్సులోను ఎంతో ఉత్సాహంగా టాస్క్‌లు ఆడింది. పల్లెటూరు వాతావరణానికి అలవాటుపడ్డ గంగ‌వ్వకు బిగ్ బాస్ హౌజ్ వాతావ‌ర‌ణం ప‌డ‌క అనారోగ్యానికి గురైంది.

వైద్యులు ఆమెని ప‌రీక్షించి ఇంటికి పంప‌డ‌మే మంచిద‌ని చెప్ప‌డంతో శ‌నివారం రోజు గంగ‌వ్వ ను బిగ్ బాస్ ఇంటికి పంపించింది. బిగ్ బాస్ బృందం ఆమెను క్షేమంగా ఇంటికి చేర్చుతామ‌ని అభ‌య‌మిచ్చిన‌ప్ప‌టికీ, ఆమె ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంద‌నే దానిపై అంతా ఆందోళ‌న చెందారు. ఈ క్ర‌మంలో మై విలేజ్ షో టీం స్పందించింది. గంగ‌వ్వ ఆరోగ్యంగా ఉంద‌ని డాక్ట‌ర్ స‌ల‌హా మేర‌కు ఆమెను స్పెష‌ల్ కేర్‌లో ఉంచామ‌ని తెలిపారు.

Tags :

Advertisement