Advertisement

  • బిగ్ బాస్లో 'మై విలేజ్ షో 'తో తనదైన గుర్తింపు పొందిన గంగవ్వ

బిగ్ బాస్లో 'మై విలేజ్ షో 'తో తనదైన గుర్తింపు పొందిన గంగవ్వ

By: chandrasekar Sat, 22 Aug 2020 3:03 PM

బిగ్ బాస్లో 'మై విలేజ్ షో 'తో తనదైన గుర్తింపు పొందిన గంగవ్వ


త్వ‌ర‌లోనే ప్రారంభం కాను౦ది తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 4. ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ రియాలిటీ షో.. లాక్‌డౌన్ కారణంగా ఈ సంవత్సరం కొంత ఆలస్యంగా మొదలు కానుంది. ఈ సారి కూడా అక్కినేని నాగార్జున వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ వీరే అంటూ ప‌లువురి పేర్లు సోష‌ల్ మీడియాలో చక్కర్ట్లు కొడుతున్నాయ్.

దీనిలో ముఖ్యంగా జబర్దస్త్ ఆది, యాంకర్ మంజూష, సింగర్ మంగ్లీ, నటుడు నందు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మరో క్రేజీ పేరు వినబడుతోంది. పాపులర్ యూ ట్యూబ్ స్టార్‌ గంగ‌వ్వ కూడా బిగ్‌బాస్ 4లో పాల్గొన‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. మై విలేజ్ షోతో గంగ‌వ్వ త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. గంగవ్వ తెలంగాణ యాస‌లో మాట్లాడుతూ మై విలేజ్ షో ద్వారా చాలా పాపులర్ అయ్యింది. అంతేకాదు గంగ‌వ్వ స‌మంత‌, కాజ‌ల్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ వంటి స్టార్స్‌ను కూడా ఇంట‌ర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో గంగవ్వను సీజ‌న్‌ ఫోర్‌కు నిర్వాహ‌కులు ఎంపిక చేశార‌ని అంతేకాదు గంగవ్వ కోసం ప్రత్యేకంగా కొన్ని ఆటల్ని డిజైన్ చేస్తున్నరంటూ ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వినిపించేస్తోంది. అయితే, ఈ వార్తపై బిగ్‌బాస్ నుంచి కానీ, గంగవ్వ నుంచి కానీ ఎటువంటి స్పష్టత లేదు. అయితే ఒక వేళా ఇదే నిజమైతే గత మూడు సీజన్‌లలో ఇంత వయసున్న వారిని బిగ్‌బాస్‌కు ఎంపిక చేయలేదని, గంగవ్వే తొలి వ్యక్తి కాబోతోందని అంటున్నారు.

Tags :
|
|

Advertisement