Advertisement

  • ఆకట్టుకుంటున్న" నారప్ప " పెద్ద కొడుకు ఫస్ట్ లుక్

ఆకట్టుకుంటున్న" నారప్ప " పెద్ద కొడుకు ఫస్ట్ లుక్

By: Sankar Sun, 05 July 2020 2:03 PM

ఆకట్టుకుంటున్న" నారప్ప " పెద్ద కొడుకు ఫస్ట్ లుక్



ఇటీవలకాలంలో వైవిధ్యభరిత సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్న హీరో విక్టరీ వెంకటేష్ ...f2 సినిమాతో భారీ విజయం సాధించిన వెంకటేష్ ఇప్పుడు మరొక కొత్త సినిమాతో ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు ..తమిళ సూపర్ హిట్ మూవీ 'అసురన్' తెలుగు రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సురేష్ బాబు, క‌లైపులిథాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో వెంకటేష్, ప్రియమణి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. వెంకీ భార్య సుందరమ్మగా ప్రియమణి కనిపించనుండటం విశేషం. ఇప్పటికే విడుదల అయిన వెంకటేష్ , ప్రియమణి ఫస్ట్ లుక్ లు అభిమానులను విశేషంగా అలరిస్తున్నాయి ..

ఇక నార‌ప్ప పెద్ద కొడుకు మునిక‌‌న్నాగా కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ కార్తిక్ ర‌త్నం న‌టిస్తున్నారు. అయితే ఈ రోజు కార్తిక్ ర‌త్నం పుట్టిన రోజు కావడంతో నారప్ప నుంచి ఆయన లుక్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ చేసింది చిత్రయూనిట్.సైకిల్ తొక్కుతూ చాలా ఆసక్తికర గెటప్‌లో కార్తిక్ కనిపించడంతో ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags :

Advertisement