Advertisement

  • రానా గురించి ఫిదా బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు...

రానా గురించి ఫిదా బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు...

By: chandrasekar Mon, 14 Dec 2020 10:51 PM

రానా గురించి ఫిదా బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు...


సాయి పల్లవి లేటెస్ట్ మూవీ 'విరాటపర్వం'పై స్పందిస్తూ స్టార్ హీరో రానా వ్యక్తిత్వం ఎలాంటిదో పేర్కొంది. 'విరాటపర్వం' సినిమా పోస్టర్‌పై రానాతో పాటు సాయి పల్లవి పేర్లు వేయడానికి కారణం రానానే అని, ఆయన వల్లనే ఇఇ విషయం జరిగిందని సాయి అన్నారు. 'విరాటపర్వం' సినిమాలో హీరోతో సమానమైన పాత్ర చేశానని, అందువల్ల పోస్టర్‌పై హీరో రానా పేరుతో పాటు తన పేరు కూడా వేశారని సాయి పల్లవి తెలిపింది. రానాకు ఉన్న గొప్ప మనసు వల్లనే అది జరిగిందంటూ చెప్పింది. నేడు నా పుట్టినరోజు కానుకగా ఈ సినిమా నుంచి రానా లుక్ రిలీజ్ చేశారు. కామ్రేడ్ రవన్నగా రానా మీ ముందుకు రాబోతున్నారని పేర్కొన్నారు.

ఈ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్, శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా సమర్పిస్తున్నారు వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రాబోతున్న ఈ సినిమా విడుదల తేదీ త్వరలోనే ప్రకటించనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ సినిమాలో నందితాదాస్‌, ప్రియమణి, నవీన్‌ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Tags :
|
|

Advertisement