Advertisement

  • ప్రముఖ సింగర్ సునీత మరియు రామ్‌ల వివాహం జనవరిలో...

ప్రముఖ సింగర్ సునీత మరియు రామ్‌ల వివాహం జనవరిలో...

By: chandrasekar Sat, 26 Dec 2020 10:39 PM

ప్రముఖ సింగర్ సునీత మరియు రామ్‌ల వివాహం జనవరిలో...


ప్రముఖ సింగర్ సునీత మరియు రామ్‌ వీరపనేనితో డిసెంబర్ 26న జరగాల్సిన పెళ్లి వాయిదా పడడంతో ఇప్పుడు మళ్ళీ డేట్ నిర్థారించారు. కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల వాయిదాపడ్డ వీరి వివాహం జనవరి నెలలో జరగనున్నట్లు తెలిసింది. సునీత మొదటి భర్తతో విడాకులు తీసికొని ఇప్పుడు తన పిల్లలతో కలసి జీవిస్తుంది.

కొద్దిరోజుల క్రితం టాలీవుడ్ సింగర్ సునీతకు డిజిటల్ మీడియా అధినేత రామ్ తో నిశ్చితార్థం జరిగిన విషయం అందరికి తెలిసిందే. వీరి పెళ్లికోసం అభిమానులంతా ఈనెల డిసెంబర్ 26 న ఎదురుచూసారు. కానీ వాయిదా పడ్డ ఈ పెళ్లి ఇప్పుడు జనవరి 9 వ తేదీన జరగనున్నట్లు వీరి ఇద్దరి కుటుంబాలు నిశ్చయించినట్లు సమాచారం అందింది. వీరి నిశ్చితార్థం ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి ప్రీ వెడ్డింగ్ పార్టీ ఫోటోలు సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుందీ.

Tags :
|
|

Advertisement