Advertisement

  • ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రముఖ సింగర్ సునీత ...

ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రముఖ సింగర్ సునీత ...

By: Sankar Mon, 07 Dec 2020 5:47 PM

ఎంగేజ్మెంట్ చేసుకున్న ప్రముఖ సింగర్ సునీత ...


టాలీవుడ్ లో ప్రముఖ సింగర్ గా ఉన్న సునీత ఈ రోజు ఉదయం నిశ్చితార్థం చేసుకున్నారు. కొద్ది రోజుల నుంచి ఆమె రెండో వివాహం చేసుకోనున్నట్లు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

ఆ వార్తను నిజం చేస్తూ ఆమె ఈ రోజు ఉదయమే వివాహ నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం. ముందు నుంచీ ప్రచారం జరిగినట్లుగానే ఆమె మ్యాంగో మీడియా అధినేత రామ్ తో నిశ్చితార్ధం చేసుకున్నారు.

కరోనా కారణంగా కేవలం రెండు కుటుంబాల పెద్దలు మాత్రమే ఈ ఉదయం శుభకార్యానికి హాజరయ్యారని సమాచారం. అయితే ఇన్ని రోజులు బట్టి పెళ్లి గురించి ప్రచారం జరుగుతున్నా సునీత స్పందించకపోవడంతో ఈ వార్తలు నిజమే అని చాలా మంది భావించారు కానీ ఆమె వైపు నుంచి ఈ నిశ్చితార్థానికి సంబంధించి కానీ పెళ్లికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు..కానీ ఈ రోజు సునీత నే స్వయంగా తన నిశ్చితార్ధం గురించి వెల్లడించారు....

Tags :
|
|

Advertisement