Advertisement

  • ప్రముఖ మోడల్ , బాలీవుడ్ నటి దివ్య చౌక్సే మరణం ..విషాదంలో బాలీవుడ్

ప్రముఖ మోడల్ , బాలీవుడ్ నటి దివ్య చౌక్సే మరణం ..విషాదంలో బాలీవుడ్

By: Sankar Mon, 13 July 2020 10:01 AM

ప్రముఖ మోడల్ , బాలీవుడ్ నటి దివ్య చౌక్సే మరణం ..విషాదంలో బాలీవుడ్



బాలీవుడ్ కి 2020 ఏ మాత్రం కలిసి రావడంలేదు ..ఇప్పటికే కరోనా కారణంగా సినిమాలు ఎక్కడిక్కడ ఆగిపోగా , ఇంకో వైపు వరుస మరణాలు బాలీవుడ్ ను విషాదంలోకి నెట్టేస్తున్నాయి ..ఇప్పటికే ఇర్ఫాన్ ఖాన్ , రిషి కపూర్ , సుశాంత్ ,సరోజ్ ఖాన్ వంటి ప్రముఖుల మరణాలతో తల్లడిల్లుతున్న బాలీవుడ్ లో మరొక ప్రముఖ మోడల్ మరియు నటి మరణం కలిచివేస్తుంది ..

ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి, సింగర్ దివ్య చౌక్సే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. గత కొంతకాలంగా కేన్సరుతో బాధపడుతున్న ఆమె కన్నుమూశారు. దివ్య చౌక్సే మృతిని ఆమె బంధువు సౌమ్యా అమిష్‌వర్మ తెలుపుతూ సంతాపం వ్యక్తం చేశారు. కాగా తన మరణానికి కొన్ని గంటల ముందు దివ్య చౌక్సే హృదయ విదారక పోస్టు పెట్టడం కన్నీళ్లు పెట్టిస్తోంది. ‘‘కేన్సరుతో నేను నెలల తరబడిగా మరణ మంచం మీద ఉన్నాను. బాధ లేని మరొక జీవితంలో కలుద్దాం. దివ్య చౌక్సే బై ’’ అంటూ ఈ పోస్టులో ఆమె పేర్కొంది.

వ్య చౌక్సే మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దివ్య మృతిపై స్పందించిన సినీనటుడు సాహిల్ ఆనంద్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించారు. మీ అభిరుచి, కల, సినీపరిశ్రమ పట్ల మీ సానుకూలత మీ అన్నయ్యనైన నన్ను ఎంతో ఆకట్టుకున్నాయి... మీ ఆత్మకు శాంతి చేకూరుగాక అని ఆయన పేర్కొన్నారు. హై అప్పా దిల్ తోహ్ అవారా సినిమాలో నటించిన ఆమె.. పలు యాడ్ ఫిల్మ్స్, టెలివిజన్ షోలలో కూడా నటించింది.

Tags :
|

Advertisement