Advertisement

  • ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మరణం ..బాలీవుడ్ దిగ్బ్రాంతి

ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మరణం ..బాలీవుడ్ దిగ్బ్రాంతి

By: Sankar Fri, 03 July 2020 10:53 AM

ప్రముఖ బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ మరణం ..బాలీవుడ్ దిగ్బ్రాంతి



బాలీవుడ్ కు ఈ ఏడాది ఏ మాత్రం కలిసి వచ్చినట్లు లేదు ..వరుసగా ప్రముఖుల మరణాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది ..ఇర్ఫాన్ ఖాన్ , రిషి కపూర్ , సుశాంత్ సింగ్ రాజపుట్ వంటి వారి మరణాలతో షాక్ లో ఉన్న బాలీవుడ్ కు మరొక ప్రముఖ వ్యక్తి మరణం కలచివేస్తుంది ..గత పది రోజులుగా గురు నానక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ కొరియోగ్రాఫేర్ సరోజ్ ఖాన్.. కార్డియాక్ అరెస్ట్‌తో చనిపోయినట్టు వైద్యులు వెల్లడించారు. ఐసీయూలో చికిత్స కొనసాగుతుండగా... ఆమె ప్రాణాలను కాపాడటానికి వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. నాలుగు దశాబ్దాల పాటు బాలీవుడ్‌తోపాటు దక్షిణాదిలో ఎన్నో చిత్రాలకు సరోజ్‌ఖాన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు...

80వ దశకంలో సరోజ్‌ఖాన్ హావా నడిచింది. ఎన్నో విజయవంతైన పాటలకు ఆమె నృత్యరీతులను సమకూర్చారు. అతిలోక సుందరి శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన నాగిని, మిస్టర్ ఇండియాలో పాటలకు సరోజ్ ఖాన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. 1974లో బాలీవుడ్ కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన సరోజ్ ఖాన్.. దాదాపు 50 ఏళ్లు పలు భారతీయ భాషా చిత్రాల్లో తన ప్రతిభను చాటుకున్నారు.

ఉత్తమ కొరియోగ్రాఫర్ విభాగంలో మూడు సార్లు జాతీయ అవార్డులను అందుకున్నారు. 2002లో సంజయ్ లీలా బన్సాలీ దర్శకత్వం వహించిన దేవదాస్ చిత్రంలోని ‘డోలారే డోలా’,మాధురి దీక్షిత్‌కు ఏంతో పేరు తెచ్చిన తేజాబ్‌లో ‘ఏక్ దో తీన్ సాంగ్’, 2007లో కరీనా కపూర్ జబ్ వుయ్ మెట్‌లో ‘యే ఇష్కీ హాయా’ పాటలకు జాతీయ పురస్కాలు దక్కాయి.అయితే సరోజ్ ఖాన్ మరణంతో పలువురు ప్రముఖులు ఆమెకు సంతాపం తెలుపుతున్నారు ..

Tags :
|

Advertisement