Advertisement

  • ప్రముఖ నటుడు , రచయిత రావి కొండలరావు కన్నుమూత

ప్రముఖ నటుడు , రచయిత రావి కొండలరావు కన్నుమూత

By: Sankar Tue, 28 July 2020 7:09 PM

ప్రముఖ నటుడు , రచయిత రావి కొండలరావు కన్నుమూత



ప్ర‌ముఖ సీనియ‌ర్ సినీ న‌టులు, రచయిత రావి కొండ‌లరావు క‌న్నుమూశారు. రావికొండ‌ల రావు గుండెపోటుతో బేగంపేటలోని ఓ ప్రైవేట్ ఆస్ప‌త్రిలో చికిత్స‌పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయ‌న సినీ ర‌చ‌యిత‌గానే కాకుండా న‌టుడిగా మంచి పేరు ప్ర‌ఖ్యాతులు సంపాదించారు.రాముడు భీముడు, తేనె మ‌న‌సులు, ప్రేమించి చూడు, అలీబాబా 40 దొంగ‌లు, అందాల రాముడు, ద‌స‌రా బుల్లోడు చిత్రాలు స‌హా 600కు పైగా చిత్రాల్లో న‌టించి అంద‌రి అభిమానం చూర‌గొన్నారు. రావికొండ‌ల రావు మృతి ప‌ట్ల ప‌లువురు సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు..

ఇక కేవలం నటుడిగానే గాక రావి కొండ‌లరావు సినీ ర‌చయిత‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు మంచి సినిమాల‌ను అందించారు. రావి కొండ‌ల రావు ర‌చ‌యిత‌గా ప‌నిచేసిన పెళ్లిపుస్త‌కం సినిమా రాజేంద్ర‌ప్ర‌సాద్ కెరీర్ లో ఆల్ టైమ్ ఫేవ‌రెట్ మూవీగా నిలిచింది. బాల‌కృష్ణ కెరీర్ లో బిగ్గ్ స్ట్ హిట్ గా నిలిచిన భైర‌వ ద్వీపం తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాల్లో మ‌రుపురాని చిత్రంగా సుస్థిర స్థానం సంపాదించుకుంది.

రాజేంద్ర‌ప్ర‌సాద్-సౌంద‌ర్య కాంబినేష‌న్ లో వ‌చ్చిన మేడ‌మ్ చిత్రంలో సౌంద‌ర్య తండ్రి పాత్ర‌లో న‌టించారు. చంట‌బ్బాయి చిత్రంలో పాండురంగారావు (చిరంజీవి పాత్ర పేరు)కు బాస్ గా త‌న న‌ట‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. శ్రీకాంత్ హీరోగా న‌టించిన రాధాగోపాలం చిత్రంలో రావి కొండ‌ల‌రావు పోషించిన పాత్ర, మీ శ్రేయోభిలాషి చిత్రంతో రాజేంద్రప్ర‌సాద్ తో ట్రావెలింగ్ అయ్యే పాత్ర ప్రేక్ష‌కులు ఎప్ప‌టికీ మ‌రిచిపోరు


Tags :
|
|
|
|

Advertisement