Advertisement

F3 పూజా కార్యక్రమం ప్రారంభం

By: Sankar Thu, 17 Dec 2020 3:04 PM

F3 పూజా కార్యక్రమం ప్రారంభం


విక్టరీ వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా , తమన్నా , మెహెరిన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో గత ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిత్రం ఎఫ్ 2...ఇప్పుడు మళ్ళీ వెంకీ , వరుణ్ తేజ్ హీరోలుగా , అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 కు కొనసాగింపుగా ఎఫ్ 3 తీస్తున్నట్లు అనిల్ రావిపూడి ఇంతకుముందే ప్రకటించాడు ..మొన్న వెంకీ బర్త్డే సందర్భంగా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసారు...

అయితే ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభ పూజ కార్యక్రమం గురువారం హైదబాద్‌లో జరిగింది. హీరోయిన్‌ తమన్నా, హీరో వరణ్‌ తేజ్‌ల ఓ సన్నివేశానికి నిర్మాత అల్లు అరవింద్ క్లాప్‌ ఇచ్చారు. ఈ నెల 23 నుంచి ‘ఎఫ్ 3’ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఎఫ్‌ 2కు నిర్మాతగా వ్యవహరించిన నిర్మాత దిల్‌రాజు ‘ఎఫ్‌ 3’ని కూడా నిర్మించనున్నారు..

అయితే ఈ సినిమాలో వెంకీ , వరుణ్ తేజ్ తో పాటుగా మరొక హీరో పాత్ర కూడా ఉన్నట్లు రూమర్స్ వస్తున్నాయి..అయితే ఈ పాత్ర మొదట రవితేజ చేస్తున్నట్లు వార్తలు రాగ , ఇప్పుడు గోపీచంద్ చేస్తున్నట్లు వస్తున్నాయి ..అయితే ఈ సినిమాలో ఇంకో హీరో ఉన్నాడో లేదో మరికొద్ది రోజుల్లో తేలిపోతుంది

Tags :
|
|
|

Advertisement