Advertisement

”ఎఫ్ 2" చిత్రానికి కేంద్ర అవార్డు...!

By: Anji Thu, 22 Oct 2020 05:08 AM

”ఎఫ్ 2" చిత్రానికి కేంద్ర అవార్డు...!

కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిత్వ శాఖ 2019కి గానూ వివిధ భాషలకు చెందిన పలు సినిమాలకు అవార్డులు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా దీనికి సంబందించిన గెజిట్ రిలీజ్ చేసింది.

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ద్వారా సినిమాల ఎంపిక చేపట్టగా ఇందులో గతేడాది జనవరిలో విడుదలైన ”ఎఫ్ 2 : ఫన్ అండ్ ఫస్ట్రేషన్” చిత్రానికి కేంద్ర అవార్డు లభించింది. ఇండియన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో టాలీవుడ్ నుంచి ‘F2’కు ఈ అవార్డు దక్కినట్లు తెలుస్తోంది.

కాగా గతేడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద సుమారు 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. థియేటర్ లోనే కాకుండా టీవీలోనూ ఈ మూవీ మంచి రేటింగ్స్ సొంతం చేసుకుంది.

విక్టరీ వెంకటేష్ – వరుణ్ తేజ్ హీరోలుగా మిల్కీ బ్యూటీ తమన్నా – మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి ‘ఎఫ్ 2’ చిత్రానికి సీక్వెల్ గా ‘ఎఫ్ 3’ ని పట్టాలెక్కించడానికి సన్నాహకాలు చేస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

Advertisement