Advertisement

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్-3

By: chandrasekar Mon, 25 May 2020 5:07 PM

అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్-3


కరోనా లాక్ డౌన్ కారణంగా చిత్ర షూటింగ్ ఆగిపోయిన సంగతి తెలిసిందే. సడలింపు కారణంగా అనిల్ రావిపూడి ఎఫ్-3 సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. సరిలేరు నీకెవ్వరు వంటి హిట్ సినిమా చేసిన తర్వాత ఎఫ్-3 చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన హిట్ చిత్రం 'ఎఫ్ 2'కి ఇది సీక్వెల్‌గా తెరకెక్కనుంది. గత కొన్నాళ్లుగా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పూర్తి స్క్రిప్టును కూడా దర్శకుడు ఇప్పటికే సిద్ధం చేశాడు.

ప్రస్తుతం వెంకటేశ్ చేస్తున్న 'నారప్ప' చిత్రం తర్వాత దీనిని సెట్స్‌కి తీసుకు వెళదామని ప్లాన్ చేశారు. అయితే, ఇప్పుడీ చిత్రం వచ్చే ఏడాదికి వాయిదా పడినట్టుగా వార్తలొస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి విధించిన లాక్ డౌన్ వల్ల ఇప్పుడీ చిత్రం షూటింగ్ ముందుకి వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే వెంకటేష్ మాత్రం అప్పుడే షూటింగ్‌లో జాయిన్ కావడం లేదని తెలుస్తోంది.

f-3,under,direction,anil,ravipudi ,అనిల్, రావిపూడి, దర్శకత్వంలో, ఎఫ్-3, కరోనా


'నారప్ప' కోసం మూడు నెలలు గడిచిన తర్వాతే ఎఫ్-3 షూటింగ్‌‌లో జాయిన్ అవుతారని, అది పూర్తవడానికి కొంత సమయం పడుతుందని అంటున్నారు. దీంతో 'ఎఫ్ 3' చిత్రాన్ని వచ్చే ఏడాది చేయడానికి వెంకీ నిర్ణయించుకున్నారట. మరి, ఈ గ్యాప్ సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఏం చేస్తారో వేచి చూడాలి.

Tags :
|
|
|

Advertisement