Advertisement

  • పేరుప్రఖ్యాతలు తీసుకొస్తుందా?లేదా? అనేవి పట్టించుకోను

పేరుప్రఖ్యాతలు తీసుకొస్తుందా?లేదా? అనేవి పట్టించుకోను

By: chandrasekar Wed, 28 Oct 2020 11:20 AM

పేరుప్రఖ్యాతలు తీసుకొస్తుందా?లేదా? అనేవి పట్టించుకోను


సినిమాను వ్యాపారకోణంలో తాను ఎన్నడూ చూడనని అంటోంది అనుష్క. ఆన్‌స్క్రీన్‌ మ్యాజిక్‌ను, సంతోషాన్ని ప్రతిక్షణం ఆస్వాదించడానికే ప్రయత్నిస్తానని అంటోంది. ‘సూపర్‌'సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసిన అనుష్క చిత్రసీమలో అడుగుపెట్టి పదిహేనేళ్లు పూర్తయ్యాయి.

ఈ ప్రయాణంలో ప్లాన్‌ చేస్తూ తానెప్పుడూ సినిమాలు చేయలేదని తెలిపింది. మనసు చెప్పిన మాటలకు కట్టుబడుతూ ముందుకుసాగానని తెలిపింది. అనుష్క మాట్లాడుతూ ‘వ్యాపార కోణంలో ఆలోచించి ఇప్పటివరకు సినిమాల్ని అంగీకరించలేదు. ఆ లెక్కలు నాకు తెలియవు. నా కెరీర్‌కు ఎంత ఉపయోగపడుతుంది? పేరుప్రఖ్యాతలు తీసుకొస్తుందా?లేదా? అనేవి పట్టించుకోను.

నా మనసుకు నచ్చితే చాలనుకుంటాను. అంతకుమించి ఏదీ కోరుకోను. ఎలాంటి ప్రణాళికలు వేసుకోకుండా సినిమాలు చేస్తాను. ఆ ఆలోచనా విధానమే నాకు విజయాల్ని తెచ్చిపెట్టింది. డబ్బు, స్టార్‌డమ్‌ ఇవ్వలేని సంతృప్తి, ఆనందాన్ని ఈ సక్సెస్‌లతో పొందాను’ అని తెలిపింది.

Tags :
|
|

Advertisement