Advertisement

  • మెగాస్టార్ రీమేక్ చేయనున్న సినిమాకి డైరెక్టర్ ఎవరో తెలుసా?

మెగాస్టార్ రీమేక్ చేయనున్న సినిమాకి డైరెక్టర్ ఎవరో తెలుసా?

By: chandrasekar Sat, 21 Nov 2020 10:40 AM

మెగాస్టార్ రీమేక్ చేయనున్న సినిమాకి  డైరెక్టర్ ఎవరో తెలుసా?


మెగాస్టార్ రీమేక్ చేయనున్న సినిమాకి డైరెక్టర్ ను ఎన్నుకున్నట్లు సమాచారం అందింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్ గా నిలిచిన లూసిఫ‌ర్ ను తెలుగులో రీమేక్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ ప్రాజెక్టు రీమేక్ అవుతుంద‌ని ప్ర‌క‌ట‌న వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ప‌లువురు డైరెక్ట‌ర్ల పేర్లు తెర‌పైకి వ‌స్తూ ఉన్నాయి. మొద‌ట సుజిత్ పేరు వినిపించింది. ఆ త‌ర్వాత చిరంజీవితో ఠాగూర్‌, ఖైదీ నం 150 వంటి బ్లాక్ బాస్ట‌ర్ చిత్రాల‌ను తీసిన వివి వినాయ‌క్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తూ వ‌చ్చింది. అయితే వినాయ‌క్ స్క్రిప్ట్ వ‌ర్క్ లో చేసిన మార్పులు చిరును ఇంప్రెస్ చేయ‌లేద‌ట‌.

అందువల్ల క‌థ‌లో వినాయ‌క్ తెలుగు నేటివిటీకి త‌గ్గ‌ట్టుగా డిజైన్ చేసిన‌ కామెడీ చిరుకు న‌చ్చ‌లేద‌ని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ప్ర‌ముఖ కోలీవుడ్ డైరెక్ట‌ర్ మోహ‌న్ రాజాకు చిరు రీమేక్ బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్టు తాజా స‌మాచారం. త‌మిళంలో హిట్‌గా నిలిచిన త‌నీ ఒరువ‌న్ ను మోహ‌న్ రాజా డైరెక్ట్ చేశాడు. తెలుగులో రాంచ‌ర‌ణ్ తో డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డి రీమేక్ చేశాడు. మ‌రి టాలీవుడ్ మెగాస్టార్ ను కోలీవుడ్ డైరెక్ట‌ర్ ఎలా చూపిస్తాడో వేచి చూడాల్సిందే. ఈ సినిమా కోసం చిరు అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు.

Tags :

Advertisement