Advertisement

  • ప్రకాశ్ రాజ్ వాయిస్ యూజ్ చేసుకొంటున్న డిస్కవరీ వైల్డ్

ప్రకాశ్ రాజ్ వాయిస్ యూజ్ చేసుకొంటున్న డిస్కవరీ వైల్డ్

By: chandrasekar Thu, 28 May 2020 11:23 AM

ప్రకాశ్ రాజ్ వాయిస్ యూజ్ చేసుకొంటున్న డిస్కవరీ వైల్డ్


ప్రపంచ వ్యాప్తంగా మంచి ఫేమస్ అయిన టీవీ చానల్‌ డిస్కవరీ. ప్రపంచంలోని అరుదైన సన్నివేశాలను బందించి కళ్లకు కట్టేలా చూపిస్తోంది. వీక్షకులకు కనువిందు చేయడంలో డిస్కవరీ ఛానల్‌ను మించింది లేదు. ప్రకృతిలో దాగి ఉన్న ఎన్నో అద్బుతాల్ని ఈ ఛానల్ మన ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. అందుకే ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ మూల కూడా డిస్కవరీ ఛానల్‌కు ప్రేక్షకులు ఉన్నారు. డిస్కవరీ ప్రధాన చానల్‌కు మరిన్ని అదనపు ఛానల్స్‌ను జోడిస్తూ ప్రపంచంలోని అనేక భాషల్లో తన వీక్షకులను పెంచుకునేందుకు డిస్కవరీ రోజు రోజుకు మరింత ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే వైల్డ్‌ లైఫ్‌ అభిమానుల కోసం డిస్కవరీ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.


discovery,wild,prakash raj,voice,is used ,ప్రకాశ్ రాజ్, వాయిస్, యూజ్, చేసుకొంటున్న, డిస్కవరీ వైల్డ్


ఇందుకు తగ్గట్టు అభిమానులను మరింత ఆకట్టుకునేలా ప్రాంతీయ భాషలకు పరిచయమున్న గొంతులోనే కార్యక్రమాన్ని వివరించాలనుకుంటుంది డిస్కవరీ. దీంతో సౌత్‌ ఇండియాలో మంచి పేరున్న, మంచి వినదగ్గ గొంతు ఉన్న నటుల కోసం వెతుకుతుంది. ఈ క్రమంలోనే ఛానల్ ప్రతినిధులు విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ను సంప్రదించింది సంస్థ. ఈ కార్యక్రమాలకు తన గొంతును ఇవ్వడానికి నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కూడా ఆసక్తి చూపించారు. దీంతో ఆయన ఓకే చెప్పడంతో డబ్బింగ్‌ కార్యక్రమం కూడా మొదలయిపోయింది. తెలుగు, తమిళం భాషల్లో నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తన వాయిస్‌ ద్వారా డిస్కవరీ వైల్డ్‌ లైఫ్‌ కార్యక్రమానికి తన గొంతు వినిపిస్తున్నారు.

ప్రకాష్ రాజ్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తనకు ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా భావిస్తున్నానంటూ ప్రకాశ్‌ రాజ్‌ తన గొంతుతో ఉన్న ఓ వీడియోను తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. అనేక మంది సెలెబ్రెటీలు తమ సంతోషాన్ని వ్యక్తం ‌ చేస్తున్నారు. మరోవైపు ప్రకాశ్ రాజ్ అభిమానులంతా ఈ విషయం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


Tags :
|
|

Advertisement