Advertisement

  • ఎం ఎస్ రాజు దర్శకుడిగా కొత్త సినిమా 'డర్టీ హరి '..

ఎం ఎస్ రాజు దర్శకుడిగా కొత్త సినిమా 'డర్టీ హరి '..

By: Sankar Fri, 17 July 2020 11:06 AM

ఎం ఎస్ రాజు దర్శకుడిగా కొత్త సినిమా 'డర్టీ హరి '..



టాలీవుడ్లో నిర్మాత ఎం ఎస్ రాజు అంటే తెలియని వారు ఉండరు ..సంక్రాంతి రాజుగా పేరుపొందిన ఈయన ఒకప్పుడు వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించాడు ..శత్రువు’, ‘దేవి’, ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి సూపర్ హిట్ చిత్రాలు రాజు గారి నిర్మాణంలోనే వచ్చాయి ..అయితే ఇటీవల కాలంలో ప్రొడ్యూసర్ గా కొంచెం వెనుకబడిన ఈయన డైరెక్టర్ అవతారం ఎత్తారు ..

రొటీన్ కథలకు స్వస్తి చెప్పి.. నేటి యువతను దృష్టిలో పెట్టుకుని ఆయ‌న తెర‌కెక్కించిన సినిమా ‘డ‌ర్టీ హ‌రి’. మనం నిత్యం క‌లిసే మనుషుల్లో దాగి ఉండే ఆటవికత్వం, విచక్షనారహిత్యం వంటి అంశాల చుట్టూ క‌థ న‌డుస్తుంది. క‌ఠోర‌మైన వాస్తవాల‌ను అంతే సున్నితంగా తెర‌కెక్కించారు ఎం.ఎస్‌.రాజు. ఓ వైపు విష‌యాన్ని చెబుతూనే క‌థ‌లో వినోదాన్ని కూడా అద్భుతంగా మేళ‌వించారు’’ చిత్ర యూనిట్ ఒక ప్రకటనలో పేర్కొంది.

కాగా, ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయని నిర్మాతలు గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉందని చెప్పారు. అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమాను తీర్చిదిద్దామని తెలిపారు. త్వరలోనే ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేస్తామన్నారు. అయితే, చిత్ర విడుదల గురించి మాత్రం ఏ విషయం చెప్పలేదు. థియేటర్లు తెరుచుకునేంత వరకు ఆగుతారా? లేదంటే ఓటీటీలో విడుదల చేస్తారా? అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.ఇక ఈ సినిమాలో శ్రవణ్ రెడ్డి, సిమ్రత్ కౌర్, రుహాణి శర్మ హీరోహీరోయిన్లుగా నటించారు ..

Tags :
|

Advertisement