Advertisement

  • మీరు ఏమి తింటున్నారో గాని ఇంకా ఇంకా యంగ్ అవుతున్నారు ..నాగార్జునకు విషెస్ చెప్పిన వర్మ

మీరు ఏమి తింటున్నారో గాని ఇంకా ఇంకా యంగ్ అవుతున్నారు ..నాగార్జునకు విషెస్ చెప్పిన వర్మ

By: Sankar Sat, 29 Aug 2020 4:47 PM

మీరు ఏమి తింటున్నారో గాని ఇంకా ఇంకా యంగ్ అవుతున్నారు ..నాగార్జునకు విషెస్ చెప్పిన వర్మ


టాలీవుడ్ కింగ్ , మన్మధుడు నాగార్జున పుట్టినరోజు ఈ రోజు ..ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల నుంచి మాత్రమే గాక సెలెబ్రిటీల నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి..అయితే నాగార్జునకు ఫస్ట్ ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు వర్మ మాత్రం తన స్టైల్ లో పుట్టినరోజు విషెస్ చెప్పారు ..

మీరు ఏమి తింటున్నారో నాకు తెలియదు, ఏ దేవుడుని ప్రార్థిస్తున్నారో..ఇంకేం చేస్తారో తెలియదు. కానీ ప్రతి పుట్టిన రోజుకి మీరు ఇంకా ఇంకా యంగ్ అయిపోతున్నారు..ఇలా అయితే కలకాలం ఇలాగే జీవించబోతున్నారు అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు. మరోవైపు ‘వైల్డ్ డాగ్’ మూవీకి సంబంధించిన పోస్టర్‌ను విడుదలపై నాగార్జున సంతోషం వ్యక్తం చేశారు. చిత్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం షూటింగ్ కు రడీ అవుతున్నానంటూ ట్వీట్ చేశారు..

గా కింగ్ నాగర్జున ఈ రోజు 61వ వసంతంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే..ఈ సందర్భంగా టాలీవుడ్ హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, నటీనటులు, ప్రముఖులతో పాటు పలువురు ఇతర రంగాల వారు కూడా అభినందనలు తెలుపుతున్నారు. ఇక నాగ్ పుట్టిన రోజు సందర్భంగా తన కొత్త సినిమా అయిన వైల్డ్ డాగ్ నుంచి సెకండ్ లుక్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది..

Tags :
|
|
|

Advertisement