Advertisement

  • పవన్ కళ్యాణ్ మీద పొగడ్తల వర్షం కురిపించిన రాంగోపాల్ వర్మ

పవన్ కళ్యాణ్ మీద పొగడ్తల వర్షం కురిపించిన రాంగోపాల్ వర్మ

By: Sankar Fri, 26 June 2020 5:34 PM

పవన్ కళ్యాణ్ మీద పొగడ్తల వర్షం కురిపించిన రాంగోపాల్ వర్మ



రామ్ గోపాల్ వర్మ ఎప్పుడో సూపర్ హిట్ సినిమాలు చేసి అగ్ర దర్శకుడిగా పేరు తెచ్చుకొని ఇండస్ట్రీ ని ఏలిన దర్శకుడు అయితే గత కొన్ని ఏళ్లుగా మాత్రం వర్మ నుంచి హిట్ సినిమా ఆశించడం కాదు కదా ఒక మోస్తరుగా ఉన్న చాలులే అనుకునేదాకా వచ్చాడు ..అదే ఇంకో దర్శకుడు ఎవరైనా ఈ పరిస్థితుల్లో ఉంటె ఎప్పుడో తట్ట బుట్ట సర్ధుకునిపోయేవాడు ..కానీ ఆలా చేస్తే తాను వర్మ ఎందుకు అవుతాడు ..వర్మ అంటే ఒక వర్గం అభిమానుల్లో ఎనలేని క్రేజ్ దీనికి కల కారణం ఒకటే ..వర్మ దేనినైనా ఎవరి గురించి అయినా నిర్మొహమాటంగా మాట్లాడతాడు ..అక్కడ ఉన్నదీ ఎవరు అనేది వర్మకు అనవసరం తన మనసుకు అనిపించింది చెప్తాడు ..అందుకే వర్మ ఉన్న దగ్గర వివాదాలు ఉంటాయి ..

ఇంత విపత్కార కరోనా పరిస్థితుల్లో అందరూ సినిమా షూటింగ్స్ వాయిదా వేసుకొని కరోనా ఎప్పుడు తగ్గుతదా అని చూస్తుంటే వర్మ వరుస సినిమాల మీద సినిమాలు తీస్తున్నాడు ..ఒకదాని తర్వాత ఒకటి ట్రైలర్స్ విడుదల చేస్తూ అందరికి షాక్ ఇస్తున్నాడు ..కేవలం సినిమాలు మాత్రమే కాకుండా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ 24 గంటలు వార్తల్లో ఉంటున్నాడు..తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ల మీద సంచలన వ్యాఖ్యలు చేసాడు ..

ఈ ఇద్దరి గురించి వర్మ మాట్లాడుతూ.. నా దృష్టిలో బెస్ట్ సీఎం అంటూ ఎవరూ లేరు కాని.. ఫ్యూచర్ సీఎం అంటే పవన్ కళ్యాణ్. అతని గురించి ఒక్క వర్డ్‌లో చెప్పాలంటే వెరీ టఫ్. అతను చాలా యునిక్. వన్ పీస్ అతడు. ఈ వర్డ్‌లోనే పవన్ కళ్యాణ్ సింగిల్ పీస్ అంటూ తెగ పొగిడేశారు వర్మ. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ.. సినిమాల పరంగా చిరంజీవి అంటే చాలా ఇష్టం. పొలిటీషియన్‌గా మాత్రం కాదు’ అని అన్నారు వర్మ. ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ‘జూనియర్ ఎన్టీఆర్ బెటర్ దెన్ సీనియర్ ఎన్టీఆర్’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు వర్మ.

Tags :
|

Advertisement