Advertisement

  • ఆంటీ-అంకుల్ అనే పిలుపుపై మండిపడుతూ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆడియో విడుదల

ఆంటీ-అంకుల్ అనే పిలుపుపై మండిపడుతూ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆడియో విడుదల

By: chandrasekar Fri, 04 Sept 2020 11:29 AM

ఆంటీ-అంకుల్ అనే పిలుపుపై మండిపడుతూ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆడియో విడుదల


డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పోడ్ కాస్ట్ ఆడియోలతో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా బయటపెడుతున్న సంగతి తెలిసిందే. సోషల్ ఇష్యూపైనా పర్సనల్ డెవలప్‌మెంట్‌పైన లైఫ్ స్ట్రగుల్స్‌పై ఇప్పటికే సంచలన కామెంట్స్ చేసిన పూరీ తాజాగా ఆంటీ-అంకుల్ అనే పిలుపుపై మండిపడుతూ ఆడియో విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. కళ్లు మూసి తెరిచేలోపు స్కూల్ డేస్ అయిపోతున్నాయి. పది రూపాయిలు సంపాదించక ముందే పెళ్లిళ్లు అయిపోతున్నాయి. ఫస్ట్ మంత్ సాలరీ వచ్చేసరికి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. ఏంది మంచో ఏది చెడో తెలుసుకునే సరికి యాభై ఏళ్లు వస్తున్నాయి. పోనీ ఇప్పుడైనా సర్దుకుందాం అనే సరికి ప్రాణాలు పోతున్నాయి. థూ. దీనమ్మా జీవితం బ్యాంకాంగ్ వెళ్లే టైం ఉండట్లా అలా తిరిగి వద్దాం అంటే కుదరట్లా.. మనసేమో డిస్కో డాన్స్ చేస్తుంది. ఎలారా భగవంతుడా అని మా టెన్షన్‌లో మేం ఉంటాం.

త్వరగా పెళ్లైపోయి 30 ఏళ్లకే ఇద్దరు పిల్లలు ఉన్న సరిత అద్దంలో చూసుకుంటుంటే పక్కింటి 20 ఏళ్ల అమ్మాయి వచ్చి ఆంటీ.. అని పిలిస్తే ఎలా ఉంటుంది? ఎక్కడో కాలదా.? ఏంటమ్మా అని పైకి అంటారు కాని.. ఆంటీ అని పిలిచిన దానికి ఒళ్లంతా వాతలు పెట్టాలని ఉంటుంది. నాకేమో ఇంకా 40 ఏళ్లు నిండలేదు. పబ్‌లో ఎవరో అమ్మాయి కనిపించింది. కార్నర్ టేబుల్ దగ్గర కూర్చుని ఆ డిమ్ లైట్‌లో హాయిగా కూర్చుని అమ్మాయితో మాట్లాడుతున్నా ఈ పాతికేళ్ల కుర్రాడు వచ్చి అంకుల్ మీరు ఇక్కడున్నారేంటి? పబ్‌కి కూడా వస్తారా? అంటే ఎలా ఉంటుంది. వెంటనే వాడ్ని అదే టేబుల్‌కి వేసి కొట్టాలనిపించింది. మీ యంగ్ జనరేషన్‌కి రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి ఆంటీ, అంకుల్ అని పిలవద్దు. పేరు పెట్టి పిలవండి. సార్ అనండి. మేడమ్ అనండి. లేదంటే ప్రభాస్‌లా డార్లింగ్ అని పిలవండి. అలా పిలిస్తే మాకూ ఎంతో ఆనందంగా ఉంటుంది. అంతేకాని ఆంటీ-అంకుల్ అంటే చావగొట్టాలని ఉంటుంది అందర్నీ’ అంటూ పూరీ అంకుల్ తన బాధను వ్యక్తపరిచారు.

Tags :
|

Advertisement