Advertisement

  • నిర్మాతగా మారనున్న పవన్ కళ్యాణ్ హిట్ సినిమా దర్శకుడు

నిర్మాతగా మారనున్న పవన్ కళ్యాణ్ హిట్ సినిమా దర్శకుడు

By: Sankar Wed, 24 June 2020 10:12 AM

నిర్మాతగా మారనున్న పవన్ కళ్యాణ్ హిట్ సినిమా దర్శకుడు

హరీష్ శంకర్ ..తెలుగు ఇండస్ట్రీ లో ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లలో ఒకడు ..చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి పేరును సంపాదించాడు ..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది..దర్శకుడిగా మంచి స్థితిలో ఉన్న హరీష్ శంకర్ కొత్తగా నిర్మాతగా మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది..ప్రేక్షకుల అభిరుచి మారుతున్న నేపథ్యంలో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీయాలనే ఆలోచనతో హరీష్ శంకర్ నిర్మాతగా మారుతున్నారని సమాచారం.

దర్శకుడిగా సినిమాలు చేస్తూనే మంచి కథలతో కొత్త దర్శకులు వస్తే సినిమాలు నిర్మించాలనే ఉద్దేశంతో స్వయంగా ప్రొడక్షన్ హౌజ్‌ను స్థాపిస్తున్నారట హరీష్. అయితే, తాను ఒంటరిగా కాకుండా పీఆర్‌వో నుంచి నిర్మాతగా మారిన మహేష్ ఎస్. కోనేరుతో హరీష్ చేతులు కలుపుతున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. తన ప్రొడక్షన్‌లో తొలి సినిమా కోసం అప్పుడే సన్నాహాలు కూడా మొదలుపెట్టారని అంటున్నారు. ప్రణీత్ అనే యువ దర్శకుడితో హరీష్ నిర్మాతగా తొలి సినిమా చేయబోతున్నారని తెలిసింది.

నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రలు పోషించిన ‘సూర్యకాంతం’ సినిమాతో ప్రణీత్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఈ సినిమాకు ముందు నిహారికతోనే ‘నాన్న కూచీ’ అనే వెబ్ సిరీస్‌ను రూపొందించారు ప్రణీత్. ఇప్పుడు ఈ యువ దర్శకుడికి హరీష్ అవకాశం ఇస్తున్నారట. క్రైం, కామెడీ అంశాలతో కూడిన కథను ప్రణీత్ ఇటీవల హరీష్, మహేష్ కోనేరుకు వినిపించారట. కథ నచ్చడంతో వీరిద్దరూ పచ్చజెండా ఊపారట.

Tags :
|

Advertisement