Advertisement

  • బిగ్ బాస్ 4 : స్వాతి ఒకవైపు ...హౌస్ మెట్స్ అందరూ మరోవైపు..?

బిగ్ బాస్ 4 : స్వాతి ఒకవైపు ...హౌస్ మెట్స్ అందరూ మరోవైపు..?

By: Anji Sun, 04 Oct 2020 09:07 AM

బిగ్ బాస్ 4 : స్వాతి ఒకవైపు ...హౌస్ మెట్స్ అందరూ మరోవైపు..?

స్వాతి కి స్క్రీన్ స్పేస్ ఇవ్వడకూడదని హౌస్ మెట్స్ ప్లాన్ వేశారా ?
స్వాతికి స్క్రీన్ స్పేస్ తక్కువ ఉండటానికి అసలు కారణం ఇదే
స్వాతిని హౌస్ మెట్స్ అందరూ కలిసి ఒంటరిదాన్ని చేస్తున్నారా ?
స్వాతి ఒకవైపు ...హౌస్ మెట్స్ అందరూ మరోవైపు ... నిరూపించుకునే ఛాన్స్ ఏది బిగ్ బాస్ !

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు రియాలిటీ షో మజాని పరిచయం చేసిన బిగ్ బాస్ షోకు భారీ స్థాయిలో రెస్పాన్స్‌ వస్తోంది. ఈ షో ఇప్పటివరకు మూడు సీజన్స్ పూర్తి చేసుకోగా ప్రస్తుతం నాలుగో సీజన్ కొనసాగుతున్నది. ప్రతీ వారం ఆసక్తికర టాస్క్ లతో ప్రేక్షకులను అలరిస్తున్న బిగ్‌బాస్-4లోకి మరో కంటెస్టెంట్‌ వచ్చేశారు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీతో మరో హీరోయిన్ హౌస్‌లోకి ప్రవేశించింది. ఈ సీజన్ లో ముచ్చటగా మూడో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది తెలుగు హీరోయిన్‌ స్వాతి దీక్షిత్ . ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తక్కువ సినిమాల్లో నటించినా కూడా తన నటన , అందంతో అందరిని కట్టిపడేసింది.

swati screen space,bigg boss housemates plan,swati screen space in bigg boss 4,telugu bigg boss 4 latest updates,telugu bigg boss 4,swathi dixit latest updates in bigg boss 4

ఇక బిగ్ బాస్ హౌస్ లో స్వాతిని చూసిన ఆమె అభిమానులు చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యారు. కానీ , స్వాతిని వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని సిల్లీ రీజన్ చెప్పి అమ్మ రాజశేఖర్ నామినేట్ చేయడం జరిగింది.కొత్తగా వచ్చింది.. అందరితో కలవాలని నామినేట్ చేస్తున్నాను అనడం చాలా సిల్లీగా అనిపించింది. వెళ్లిన రెండు రోజులకే నామినేట్ అవ్వడం అంటే ఎవరికి అయినా కాస్త ఇబ్బందిగానే అనిపిస్తుంది.

దీనితో కొంచెం అప్సెట్ అయినట్టు మొదట్లో కనిపించినా కూడా ఆ తర్వాత బిగ్ బాస్ అన్నాక నామినేషన్స్ ను ఎదుర్కోక తప్పదు అని భావించి , ఆ విషయాన్ని పక్కన పెటేసింది. అయితే , ఆమె పై హౌస్ మెట్స్ కూడా కొంచెం వ్యతిరేకత చూపిస్తున్నారు. దీనితో ఆమెకి ఎక్కువగా స్క్రీన్ స్పేస్ అనేది రాకుండా చేస్తున్నారు. టాస్కుల్లో గొడవలు పెట్టుకుంటూ , ఎప్పుడు బిగ్ బాస్ మైండ్ మొత్తం వారి వైపే ఉండేలా చేసుకోవడంతో స్వాతికి రన్ టైం లో ఎక్కువగా స్క్రీన్ స్పేస్ రావడం లేదు.

swati screen space,bigg boss housemates plan,swati screen space in bigg boss 4,telugu bigg boss 4 latest updates,telugu bigg boss 4,swathi dixit latest updates in bigg boss 4

మోనాల్ ఏడుపు చూపించినట్టుగా స్వాతి మాట్లాడే మాటలని చూపించడం లేదు. అలాగే హౌస్ మెట్స్ లో ఎక్కువమంది ఆమెని అవైడ్ చేస్తునట్టు కనిపిస్తుంది. అభిజిత్ , అవినాష్ తప్ప మిగిలిన వారిలో ఏ ఒక్కరు కూడా స్వాతితో ఎక్కువ సేపు గడిపినట్టు ఒక్క క్లిప్ కూడా లేదు. ఇది వారి గేమ్ ప్లాన్ కావచ్చు.

స్వాతితో ఎవరు మాట్లాడకపోతే .. ఆమెపై బిగ్ బాస్ ఎక్కువగా ఫోకస్ పెట్టడు అన్నట్టుగా అలోచించి ఆమెతో అంతగా మాట్లాడటం లేదు అని హౌస్ మెట్స్ ప్రవర్తన చూస్తే అనిపించకమానదు. ఏదేమైనా పరోక్షంగా కానీ , ప్రత్యక్షంగా కానీ స్వాతి స్క్రీన్ స్పేస్ ఎక్కువగా ఇవ్వడం లేదనేది వాస్తవం. అయినప్పటికీ స్వాతి కనిపించిన ఆ తక్కువ టైం లో చక్కటి చిరునవ్వు , ఆహ్లదకరమైన మాటలతో అందరిని ఆకట్టుకుంటుంది. ఇకనైనా బిగ్ బాస్ దీనిపై దృష్టి పెట్టి స్వాతికి స్క్రీన్ స్పేస్ ఇస్తారేమో చూడాలి.

Tags :

Advertisement