Advertisement

  • ఇన్‌స్టాగ్రామ్‌లో అయిదు కోట్ల ఫాలోవర్లు ..కోహ్లీ , ప్రియాంక చోప్రా సరసన దీపికా పదుకొనె ...

ఇన్‌స్టాగ్రామ్‌లో అయిదు కోట్ల ఫాలోవర్లు ..కోహ్లీ , ప్రియాంక చోప్రా సరసన దీపికా పదుకొనె ...

By: Sankar Wed, 08 July 2020 4:50 PM

ఇన్‌స్టాగ్రామ్‌లో అయిదు కోట్ల ఫాలోవర్లు ..కోహ్లీ , ప్రియాంక చోప్రా సరసన దీపికా పదుకొనె ...



బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో 50 మిలియన్ల (5 కోట్లు) మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ఇండియన్‌గా నిలిచింది. రెండ్రోజుల క్రితం 50 మిలియన్‌ మార్కును క్రాస్ చేసిన దీపిక తాజాగా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది.

తనను ఫాలో అవుతున్న అందరికీ దీపిక ధన్యవాదాలు తెలియజేసింది. దీపిక ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉంటుంది. తన సినిమాలకు సంబంధించిన విశేషాలు మాత్రమే కాకుండా, ఈవెంట్ లుక్స్, మేగజీన్ కవర్‌పేజీలపై ఆమె మెరిసిన సందర్భాలను, ఫొటోషూట్లను, తన వ్యక్తిగత విశేషాలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండ్ ప్రమోషన్ల ద్వారా కూడా దీపిక భారీగా ఆదాయం ఆర్జిస్తోంది.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం దీపికా షాకున్ బాత్రా దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తుంది ..ఈ సినిమాలో ఈమె తో పాటు అనన్య పాండే , సిద్దార్థ్ చతుర్వేది కూడా నటిస్తున్నారు ..ఇక కపిల్ దేవ్ బయోపిక్ అయిన 83 లో కూడా తన భర్త రణ్వీర్ సింగ్ తో నటిస్తుంది ..ఈ సినిమాకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు ..

Tags :
|

Advertisement