Advertisement

‘అంధకారం’ టీజర్ రిలీజ్...

By: chandrasekar Fri, 06 Nov 2020 04:06 AM

‘అంధకారం’ టీజర్ రిలీజ్...


‘అంధ‌కారం’ ప్రముఖ ద‌ర్శకుడు అట్లీ స‌మ‌ర్పణ‌లో ప్రియ అట్లీ, కే పూర్ణ చంద్ర, సుదాన్ సుంద‌ర‌మ్ నిర్మాత‌లుగా వి.విజ్ఞరాజ‌న్ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కిన సినిమా. ‘స్వామిరారా’, ‘పిజ్జా’ వంటి థ్రిల్లర్స్‌తో తెలుగు ప్రేక్షకుల‌కి సుప‌రిచిత‌మైన పూజా రామ‌చంద్రన్ కీల‌క పాత్రలో ఈ సినిమా తెర‌కెక్కింది. పూజా రామచంద్రన్‌తో పాటు అర్జున్ దాస్, వినోత్ కిష‌న్, కుమార్ న‌ట‌రాజ‌న్, మీనా గోషాల్ కూడా లీడ్ రోల్స్‌లో న‌టించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని రిలీజ్‌కి రెడీగా ఉన్న ఈ సూప‌ర్ స‌స్పెన్స్ థ్రిల్లర్‌ని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ ద్వారా విడుద‌ల చేయ‌నున్నారు.

నెట్‌ఫ్లిక్స్‌లో న‌వంబ‌ర్ 24 నుంచి ఈ సినిమా లైవ్ స్ట్రీమింగ్ అవుతుంద‌ని నిర్మాత‌లు సుదాన్, ప్రియ అట్లీ పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలోనే ‘అంధ‌కారం’ చిత్ర టీజ‌ర్‌ను ప్రముఖ సంగీత ద‌ర్శకుడు థ‌మ‌న్ తాజాగా త‌న ట్విట్టర్ ఖాతా ద్వారా విడుద‌ల చేసి, చిత్ర బృందానికి శుభ‌కాంక్షలు తెలిపారు. ఈ సినిమా త‌మిళ వెర్షన్ ‘అంధ‌గార‌మ్’ టీజ‌ర్‌ని ప్రముఖ తమ‌ళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ విడుద‌ల చేయ‌డం విశేషం. టీజ‌ర్ మొత్తాన్ని స్టన్నింగ్ విజువ‌ల్స్‌తో, థ్రిల్లింగ్ సౌండ్‌తో డిజైన్ చేయడంతో ఆడియెన్స్‌కి సినిమా మీద మ‌రింత ఉత్కంఠ క‌లుగుతుంది. ఈ సినిమాకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వర‌లోనే అధికారికంగా విడుద‌ల చేస్తామ‌ని సుదాన్ తెలిపారు. ఈ సినిమాకు ప్రదీప్ కుమార్ సంగీతం సమకూర్చారు.

Tags :
|
|

Advertisement