Advertisement

  • కాబోయే భార్య నటాషా గర్భంతో ఉన్నట్లు క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రాంలో

కాబోయే భార్య నటాషా గర్భంతో ఉన్నట్లు క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రాంలో

By: chandrasekar Mon, 01 June 2020 10:16 PM

కాబోయే భార్య నటాషా గర్భంతో ఉన్నట్లు క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రాంలో


తన కాబోయే భార్య నటాషా గర్భంతో ఉన్నట్లు క్రికెటర్ హార్దిక్ పాండ్యా తెలిపారు. ఈ మేరకు ఆమెతో కలిసి ఉన్న ఫోటోలను తన ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశాడు. నేను నటాషా ఇన్నాళ్లూ ఎంతో అన్యోన్యంగా ఉన్నాం. ఇప్పుడు అది మరింత బలపడుతోంది. ఈ లోకంలోకి రాబోయే మా ప్రతిరూపాన్ని ఆహ్వానించేందుకు మేము ఇద్దరం ఎంతో ఆత్రుతగా ఉన్నాం అంటూ రాసుకొచ్చాడు.

తమ జీవితంలో ఇదో కొత్త ఘట్టమని, దీనికి అందరి ఆశీస్సులు కావాలని తన అభిమానులను హార్దిక్ కోరాడు. దీనిపై స్పందించిన భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్తి ఇద్దరినీ అభినందించాడు. యుజ్వేంద్ర చాహాల్ కూడా వీరికి తన అభినందనలు తెలిపాడు. ఇదిలా ఉంటే ఉన్నట్లుండి హార్దిక్ ఈ ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు అనేకరకాల ఊహాగానాలకు తెరలేపారు. లాక్‌డౌన్ వీరిద్దరూ పెళ్లి చేసేసుకుని ఉంటారని, అందుకే ఇప్పుడు ఈ ఫోటోలను పాండ్యా షేర్ చేశాడని చర్చించుకుంటున్నారు. హార్దిక్ షేర్ చేసిన ఫోటోలలో ఓ దానిలో ఇద్దరూ దండలు ధరించి పూజా కార్యక్రమాలు చేస్తుండడం ఈ వాదనలకు మరింత ఊపునిస్తోంది.

Tags :
|

Advertisement