Advertisement

  • నేను తీసిన తొలి కుటుంబ కథా చిత్రం కరోనా వైరస్ ..రాంగోపాల్ వర్మ

నేను తీసిన తొలి కుటుంబ కథా చిత్రం కరోనా వైరస్ ..రాంగోపాల్ వర్మ

By: Sankar Sun, 31 May 2020 11:29 AM

నేను తీసిన తొలి కుటుంబ కథా చిత్రం కరోనా వైరస్ ..రాంగోపాల్ వర్మ

రాంగోపాల్ వర్మ..ఈ పేరు కి ఉన్న ఫాలోయింగ్ అంత ఇంతా కాదు..తెలుగు లో మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో దర్శకుడిగా గొప్ప పేరు సంపాదించినా వర్మ ఎందుకో ఇటీవల కాలంలో తన స్థాయికి తగ్గ సినిమాలు తీయలేకపోతున్నాడు ..తాజాగా కరోనా వైరస్ పేరుతో సినిమా నిర్మించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసిన వర్మ , సినిమా కి సంబంధించిన విషయాలపై విలేకరులతో మాట్లాడాడు

ఇప్పుడంతా డిజిటల్ ఫ్లాట్ ఫారం యుగమే అని అన్నాడు ..సినిమా హాల్ లో సినిమా రిలీజ్ చేయాలి అంటే పబ్లిసిటీకి ఎంతో ఖర్చు చేయాలి , అంత చేసినప్పటికీ థియేటర్ కి ప్రేక్షకుడు వస్తాడు అని నమ్మకం లేదు , అదే డిజిటల్ స్ట్రీమింగ్ అయితే నిర్మాతకు చాల వరకు ఖర్చు తగ్గుతుంది , కాకపోతే ప్రేక్షకుడు థియేటర్ లో సినిమా చుసిన అనుభూతిని పొందలేడు , దీనిలో ఇది ఒకటే మైనస్ అని అన్నాడు ..

పెద్ద పెద్ద యాక్షన్‌ సినిమాలు, ‘బాహుబలి’ వంటి విజువల్‌ వండర్‌ సినిమాలయితే థియేటర్‌లో చూడటానికి బాగుంటాయి. కానీ కొన్ని స్టోరీ బేస్డ్, కంటెంట్‌ ఉన్నవి ఓటీటీలో వర్కౌట్‌ అవుతాయి. అలాగే ఫీచర్‌ ఫిల్మ్‌ అంటే కనీసం రెండు గంటల నిడివి ఉండాలన్న కండీషన్‌ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఉండదు. నా ‘క్లైమాక్స్‌’ మూవీ నిడివి 55నిమిషాలు మాత్రమే.

నేను తీసిన తొలి కుటుంబ కథాచిత్రం ‘కరోనా వైరస్‌’. ఇది నా దృష్టిలో ఒక హారర్‌ ఫిల్మ్‌. దెయ్యం బదులు వైరస్‌ ఉంది. అంతే తేడా. ఇన్ని దశాబ్దాల తర్వాత ఎవరో దగ్గుతున్నారని మనం భయపడుతున్నామంటే అది హారర్‌ సినిమాయే కదా! యాక్చువల్లీ ఇప్పుడు ప్రపంచం అంతా ఓ హారర్‌ ఫిల్మ్‌లా ఉంది. ప్రభుత్వం ఇచ్చిన గైడ్‌లైన్స్‌ను పాటిస్తూనే ‘కరోనావైరస్‌’ చిత్రాన్ని చేశాం. ఆర్టిస్టులను ఒక చోటుకు చేర్చి సినిమాను ఎలా పూర్తి చేశానన్నది ఆర్జీవీ సీక్రెట్‌.




Tags :
|

Advertisement