Advertisement

Breaking News: సీనియర్ నటికి కరోనా పాజిటివ్..!

By: Anji Tue, 22 Sept 2020 1:52 PM

Breaking News: సీనియర్ నటికి కరోనా పాజిటివ్..!

కరోనా మహమ్మరి లేని వారిని,ఉన్న వారిని కూడా వదలడం లేదు. టాలీవుడ్ లో ఇప్పటికి కరోనా బారిన పడిన వారిలో మెగా ఫామిలీ నాగ బాబు, డైరెక్టర్ ఎస్ ఎస్ రాజా మౌళి, డాన్సు మాస్టర్ శేఖర్, స్టార్ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్య ఇలా చాల మందిని ఈ మహమ్మారి మాత్రం వదలడం లేదు.

తాజాగా సీనియర్‌ బాలీవుడ్ నటి జరీనా వహాబ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో ఆమె ముంబైలోని లీలావతి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారు. శ్వాస సమస్య, కీళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పులు, జ్వరం లక్షణాలతో బాధపడుతున్న జరీనా వహాబ్‌లో ఆక్సిజన్‌ లెవల్స్ తక్కువగా ఉండటంతో వైద్యులు ఆమెను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్సను అందిస్తున్నారు.

ప్రస్తుతం జరీనా క్షేమంగానే ఉన్నారని, స్పందిస్తున్నారని డాక్టర్స్‌ తెలిపారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో జరీనా వహాబ్‌ నటించారు. ప్రస్తుతం రానా దగ్గుబాటి, సాయిపల్లవి కాంబినేషన్‌లో వేణు ఊడుగుల రూపొందిస్తోన్న విరాటపర్వం చిత్రంలో ఈమె ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.

Tags :

Advertisement