Advertisement

  • ప్రముఖ నటుడు రావి కొండల రావు మరణంపై స్పందించిన సీఎం కెసిఆర్

ప్రముఖ నటుడు రావి కొండల రావు మరణంపై స్పందించిన సీఎం కెసిఆర్

By: Sankar Tue, 28 July 2020 9:39 PM

ప్రముఖ నటుడు రావి కొండల రావు మరణంపై స్పందించిన సీఎం కెసిఆర్



సీనియర్ నటుడు, రచయిత, రంగస్థల కళాకారుడు రావి కొండలరావు మరణానికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మంగళవారం సాయంత్రం ఒక ప్రకటన ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. అప్పట్లో కొండల్‌రావు అత్యుత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఉండేవాడని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ గుర్తు చేసుకున్నారు. అతడి ఆత్మకు శాంతి చేకూరాలని కేసీఆర్‌ ప్రార్ధించారు.

ఇదిలా ఉండగా కొండ‌లరావు గుండెపోటుతో బేగంపేటలోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స‌పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయ‌న సినీ ర‌చ‌యిత‌గానే కాకుండా న‌టుడిగా మంచి పేరు ప్ర‌ఖ్యాతలు సంపాదించారు.పెళ్లి పుస్తకం , భైరవ ద్వీపం వంటి సినిమాలకు రచయిత పని చేసాడు..

ఇక కొండల రావు మరణంపై మెగాస్టార్ చిరంజీవి కూడా సంతాపం తెలిపిన విషయం తెలిసిందే , సినీ ఇండస్ట్రీ పెద్ద దిక్కుని , బహుముఖ మేధావిని కోల్పోయింది అని మెగాస్టార్ వాఖ్యానించాడు ..కాగా కొండల రావు గారు చిరంజీవి హీరోగా నటించిన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలు చేసారు ..

Tags :
|
|
|

Advertisement