Advertisement

  • కంటతడిపెట్టించి అదిరిపోయే క్లైమాక్స్‌తో హిట్ కొట్టిన సినిమాలు

కంటతడిపెట్టించి అదిరిపోయే క్లైమాక్స్‌తో హిట్ కొట్టిన సినిమాలు

By: Dimple Mon, 10 Aug 2020 5:26 PM

కంటతడిపెట్టించి అదిరిపోయే క్లైమాక్స్‌తో హిట్ కొట్టిన సినిమాలు

సినిమా మధ్యలో కొన్ని కొన్ని అద్భుతమైన సీన్లు ఉన్నా, ఆడియన్ మనసును కట్టడిజేసేది క్లైమాక్స్ సీన్లే। సినిమా ఆంతర్యాన్ని, కథకున్న బలాన్ని స్పష్టం చేసే ఆ సన్నివేశాలు ప్రేక్షకుడి మదిలో నిలిచిపోతాయి। మరి అలా కట్టిపడేసిన క్లైమాక్స్ సీన్లున్న కొన్ని సినిమాల గురించి మాటాడుకుంటే, ఈ మధ్య వచ్చిన వాటిలో రంగస్థలం గుర్తొస్తుంది। సుకుమార్ దర్శక ప్రతిభ ని ఈ సినిమా కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది। 1980 బ్యాక్ డ్రాప్ లో వచ్చిన రంగస్థలం, ఇండస్ట్రీ రికార్డులని తిరగరాసింది। సినిమా మొత్తం ఒకెత్తయితే, క్లైమాక్స్ ఒకెత్తు। ఊరి బాగు కోసం పోరాడుతూ కనిపించిన కుమార్ బాబు క్యారెక్టర్ చనిపోవడంతో సినిమా అనూహ్య మలుపు తిరుగుతుంది। ఓరయ్యో పాటతో రంగస్థలం సినిమా, చాల మందికి ఆల్ టైం ఫేవరైట్ గా నిలిచిపోయింది। తన అన్నని చంపింది ఎవరో అని తెలుసుకునే ప్రయత్నంలో ఊరు ఊరంతా ఒక్కటవుతుంది। అందరూ ఊహించిందానికి భిన్నంగా, చిట్టిబాబు తన అన్నని చంపిన వారిని పట్టుకుని సినిమాకి ఇచ్చిన క్లైమాక్స్, సినిమాని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిపింది। దేవి శ్రీ మ్యూజిక్ తో మూవీ ఆసాంతం, ప్రేక్షకుడిని గగుర్పాటుకు గురిచేస్తూ ఉంటుంది।

ఇక అదే కోవలోకి వచ్చే చిత్రం జై లవ కుశ। యంగ్ టైగర్ నటవిశ్వరూపంతో సాగిన ఈ సినిమా, ప్రేక్షకుల కేరింతలతో బాటు, విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది। తారక్ త్రిపాత్రాభినయానికి తెలుగు సినీ ప్రేక్షకులు బ్రహ్మ రథం పట్టారు। ఇక ఈ సినిమా క్లైమాక్స్ ఆడియన్ చేత కంట తడి పెట్టిస్తుంది। అప్పటివరకు అన్యాయాలు,అక్రమాలు చేస్తూ కనిపించే పెద్ద తారక్, తన తమ్ముళ్ల ని కాపాడుతూ ప్రాణాలు వదిలేస్తాడు। మూడు పాత్రల్లో యంగ్ టైగర్ కనబరచిన నటనా కౌశల్యం వర్తమాన నటులకు ఓ ఎన్సైక్లోపీడియా వంటిది।

ఇక ఈ మధ్య వచ్చిన సినిమాలలో, అంతగా గుర్తుండిపోయే క్లైమాక్స్ ఉన్న సినిమా సైరా నరసింహ రెడ్డి। తెల్లదొరల దురహంకారానికి, తెలుగు వీరుడు బుద్ది చెప్పిన విధానం సినీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది। ఇక మధ్యలో 'గడ్డిపరక కూడా గడ్డ దాటడానికి వీల్లేదు' అని చెప్తూ, మెగాస్టార్ మేనియా ఏ విధంగా ఉంటుందో చూపించాడు। ఇక క్లైమాక్స్ లో అయితే ప్రతీ ఒక్క ప్రేక్షకుడి ని గగుర్పాటుకు గురిచేస్తూ, చిరు చెప్పిన మాటలు సైరా అనిపించుకున్నాయి। బుర్రా సాయి మాధవ్ డైలాగ్లు చిరు నోట తూటాల్లా పేలాయి। ఉరితాడును చూస్తూ విసిరే చూపు, తెలుగు వీరుల గర్వాన్ని ఘనంగా చాటిచెప్పింది। తలెత్త౦డి అంటూ మొదలైన సీన్, ప్రతీ భారతీయుడు తలెత్తుకునేలా చేసింది। కళ్ళు తుడుచుకుని రొమ్ము విరుచుకొని సగర్వంగా చూడమంటూ నరసింహ రెడ్డి రూపం లో నట విశ్వరూపాన్ని చూపాడు చిరు। ప్రపంచానికి ముక్తి నేర్పింది మనం, ఇక విముక్తి నేర్పుదాం అంటూ విప్లవ పిలుపునందించాడు। స్వాతంత్య్రం కోసం యోధుడు వదిలిన ప్రాణం యుద్ధం లా పుడుతుంది, ఇక పై నేను యుద్దాన్ని అంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకున్నాడు మెగాస్టార్। ప్రతీ యుద్ధం నాయకుడి మరణంతో ముగుస్తుంది, కానీ నీ మరణంతో ఈ యుద్ధం మొదలవుతుంది అంటూ, అమితాబ్ చెప్పిన డైలాగ్ తో సైరా సినిమా కి సార్థకత లభించింది। టాలీవుడ్ చరిత్రలో ఈ మధ్య వచ్చిన వాటిలో ఎక్కువ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిన సినిమాల్లో సైరా టాప్ ప్లేస్ లో ఉంటుంది।

ఇక ఉరీకి ఉత్తరాన దారీకి దక్షిణాన అంటూ అరవింద సమేత కూడా ఆ సినిమా రిసల్ట్ మీద పెద్ద ఇంపాక్ట్ ని క్రియేట్ చేసింది। బసిరెడ్డి ని అంతం చేసాక తారక్ నేరుగా వాళ్ళింటికి వెళ్లి, నల్ల గుడిని కాస్త దేవగుడిగా మారుస్తూ మంచి క్లైమాక్స్ ని అందించారు। త్రివిక్రమ్ మార్క్ కి పూర్తి భిన్నం గా ఉండే ఈ సినిమా మంచి క్లైమాక్స్ తో అదిరిపోయే విజయాన్ని అందుకుంది। సినిమా విజయం లో క్లైమాక్స్ ఎంత కీలకమో చెప్పిన మరో సినిమా ధ్రువ। రామ్ చరణ్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో, అరవింద స్వామి విలన్ గా నటించారు।
తనకు తానుగా చనిపోతూ, సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు। మంచి కథతో నడిచిన సినిమాని సరైన సీన్ తో ముగిస్తే , అది సూపర్ హిట్ గా నిలబడడం ఖాయం। ప్రతీ సినిమాకి ఇదే విధమైన కమర్షియల్ క్లైమాక్స్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయలేము।

కథకు తగ్గ క్లైమాక్స్ పెడితే బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం అని మిరూపించిన చిన్న సినిమాలు ఉన్నాయి। కేర్ ఆఫ్ కంచర పాలెం సినిమాకి, కథంతా ఒకెత్తు, క్లైమాక్స్ ఒకెత్తు। సినిమా చూసి బయటికి వచ్చే ప్రతీ ప్రేక్షకుడి కళ్ళలో ఓ మెరుపును తీసుకొచ్చింది ఈ సినిమా। జెర్సీ సినిమా కూడా బ్యూటిఫుల్ క్లైమాక్స్ తో ఆడియన్ ని కంటతడి పెట్టిస్తుంది। మంచి కథ ఉంటేనే మంచి క్లైమాక్స్ ని క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది, అది తెలిసున్న దర్శకుడు ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా నమ్మింది తీస్తే, ఆ సినిమాని ఆదరించడానికి ప్రేక్షకులు ఎప్పుడు సిద్ధం గా ఉంటారు ।

climax,movie,review,film,summary,in,tolywood ,కంటతడిపెట్టించి, అదిరిపోయే, క్లైమాక్స్‌తో, హిట్ ,కొట్టిన, సినిమాలు

సమాజంలో బంధాలు అనుబంధాలు కరువయ్యాయి. కాటికి కాళ్లుచాచే వయసులో అయినోళ్లు పట్టించుకోవడంలేదు.. ప్రాణం ఉన్నపుడే ఎవ్వరూ చూసుకునేవాళ్లే లేరు. అలాంటిది ప్రాణం పోయిన తర్వాత ఎవరు పట్టించుకుంటారనుకున్నారేమో ఆ వృద్ధ దంపతుతు.. బతికి ఉండగానే స్వతహాగా సమాధులు కట్టుకున్నారు.
తెలంగాణాలోని కామారెడ్డి జిల్లాలో ఓ వృద్ధ దంపతులు తాము బ్రతికి ఉండగానే వారికివారే సమాధులు కట్టించుకున్నారు. తమ విగ్రహాలు కూడా తయారు చేయించుుని పెట్టేసుకున్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం డోంగ్లీ గ్రామంలో నివసిస్తున్న సోపాన్, అంజనీ బాయి దంపతులకు నలుగురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇద్దరు కూతుళ్లకు..నలుగురు కొడుకులకు కూడా పెళ్లిళ్లు చేసేశారు.
పిల్లలందరికీ అందరికీ పెళ్లిళ్లు చేశారు. ఆస్తులు కూడా పంచి ఇచ్చేశారు. ఎవరికి వారు వేరు కాపురాలు పెట్టుకుని బతుకుతున్నారు. ఇంతలో ఆ దంపతులు, కొడుకులను షాక్ ఇస్తూ…గ్రామ శివారులో రూ.లక్షతో వంద గజాల స్థలాన్ని కొని, ఆ స్థలంలో తమ సమాధులను కట్టించుకున్నారు.
భార్యా భర్తా సమాధుల్ని వేరు వేరుగా కట్టించుకున్నారు.
అంతేకాదు..గ్రామంలో హనుమాన్ మందిర నిర్మాణం కోసం వచ్చిన కళాకారులతో విగ్రహాలను తమ ఇద్దరి విగ్రహాలు తయారు చేయించుకున్నారు. అలా తయారు చేయించున్న తమ విగ్రహాలను సమాధులపై ప్రతిష్టించుకున్నారు. విగ్రహాల తయారీకి..సమాధులు కట్టించటానికి అన్నింటికీ కలిపి రూ.2.5 లక్షలు వరకూ ఖర్చు పెట్టారు.

ఈ విషయం తెలిసిన కొడుకులు, కూతుళ్లు తల్లిదండ్రుల్ని నిలదీశారు. తల్లిండ్రుల్ని పట్టించుకోవట్లేదని వారిని సరిగా చూసుకోవట్లేదేమో రేపు వాళ్లు చనిపోయాక సమాధులు కట్టిస్తోరో లేదోనని వాళ్లకు వాళ్లే ఇలా చేశారని మా గురించి అందరూ అపార్థం చేసుకోరా? చెడుగా మాట్లాడుకోరా? అని ప్రశ్నించారు. అలాగే గ్రామస్తులు కూడా అదే అనుకున్నారు. బతికుండగానే ఇదేంపని అని అనుకున్నారు.

దాని ఆ ముసలి దంపతులు మాట్లాడుతూ..ఎవర్నీ నొప్పించడానికి ఈ పని చేయలేదని..తమ ఆత్మసంతృప్తి కోసం ఈ పని చేశామని..కొడుకులు తమకోసం చేస్తారు.. కానీ తమ సమాధుల్ని తాము కోరినట్లుగా తమ కొడుకులు నిర్మిస్తారో లేదోననే తామే ఆ పని చేయించుకున్నామని గ్రామస్తులకు కూడా చెప్పారు.

వారు ఆ నిర్ణయం తీసుకోవాటానికి గల మరో కారణం గురించి చెబుతూ..సోపాన్ దంపతులు ఓ రోజు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కాలా గ్రామంలో జరిగిన పెళ్లికి వెళ్లారు. అక్కడ ఊరి చివర్లో నిర్మించిన సమాధుల్ని చూసి ఆశ్చర్యపోయారు. అవి వారికి బాగా నచ్చాయి. తాము కూడా ఆ మోడల్ సమాధుల్ని నిర్మించుకుంటే ఎలా ఉంటుందని అనుకున్నారు. అలా తమ ఆలోచనలకు బతికుండగానే రూపునిచ్చుకున్నామని..అంతే తప్ప వేరే ఏ ఉద్ధేశంతోను చేయలేదని సోపాన్, అంజనీ బాయి తెలిపారు.

Tags :
|
|
|
|
|

Advertisement