Advertisement

  • ఆదిపురుష్ సినిమాలో ప్ర‌భాస్ తో నటించే సీత రోల్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర‌యూనిట్

ఆదిపురుష్ సినిమాలో ప్ర‌భాస్ తో నటించే సీత రోల్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర‌యూనిట్

By: chandrasekar Thu, 10 Sept 2020 09:22 AM

ఆదిపురుష్ సినిమాలో ప్ర‌భాస్ తో నటించే సీత రోల్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర‌యూనిట్


ఆదిపురుష్ సినిమాలో రాముడి పాత్రలో నటించే ప్ర‌భాస్ తో హీరోయిన్ గా సీత రోల్ పై చిత్ర‌యూనిట్ క్లారిటీ ఇచ్చింది. టాలీవుడ్ యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌ధాన పాత్ర‌లో ఆదిపురుష్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఓం రావ‌త్ డైరెక్ష‌న్ లో వ‌స్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ లంకేశ్ పాత్ర‌లో న‌టించ‌నున్నాడు. అయితే భారీ ప్రాజెక్టులో ప్ర‌భాస్ రాముడిగా క‌నిపించ‌నుండ‌గా సీత రోల్ పోషించే న‌టి ఎవ‌ర‌నే విష‌యంపై ప‌లు వార్త‌లు లైమ్ లైట్ లోకి వ‌చ్చాయి. సీత పాత్ర కోసం కీర్తిసురేశ్‌, కైరా అద్వానీ పేర్ల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు టాక్ వినిపించింది.

ఈ సినిమాలో సీత పాత్రలో ఎవరు నటించనున్నారని ప్రేక్షకులమధ్య సందేహం నెలకొంది. తాజాగా బాలీవుడ్ న‌టి ఊర్వ‌శి రూటేలా పేరు బీటౌన్ లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ పుకార్ల‌ను చిత్ర‌యూనిట్ కొట్టిపారేసింది. హీరోయిన్ గా ఊర్వ‌శి రూటేలాను ఫైన‌ల్ చేసిన‌ట్టు వ‌చ్చిన న్యూస్ అవాస్త‌వం. హీరోయిన్ ఎవ‌రనే అంశంపై స‌రైన స‌మ‌యంలో ప్ర‌క‌ట‌న చేస్తామ‌న్నారు. 3డీ విజువ‌ల్ ఎఫెక్ట్స్ తో తీయ‌నున్న ఈ మూవీని తెలుగు, హిందీ, త‌మిళం, మ‌ల‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో తెర‌కెక్కిస్తున్నారు. ప్రభాస్ అభిమానులు అతను చేయనున్న రాముని పాత్రా పై సంతోషాన్ని వెలిబుచ్చారు.

Tags :
|

Advertisement