Advertisement

చిరంజీవి భార్య సురేఖ కోరిక

By: chandrasekar Thu, 01 Oct 2020 4:48 PM

చిరంజీవి భార్య సురేఖ కోరిక


ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో రామ్ చరణ్ నటించనున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి సుమారు 30-45 నిమిషాల కీలకమైన పాత్ర పోషించనున్నారు. తండ్రి, కొడుకులు ఇద్దరూ కలిసి ఈ సినిమాలో నటించాలని చిరంజీవి భార్య సురేఖ కోరిక మేరకే ఆ విధంగా సినిమాను ప్లాన్ చేస్తున్నట్టు ఫిలింనగర్ అనుకుంటోంది. ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్ కలిసి మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నంబర్ 150 సినిమాల్లో నటించారు. కాకపోతే మగధీర, బ్రూస్ లీ సినిమాల్లో చిరంజీవి ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఖైదీ నంబర్ 150 సినిమాలో రామ్ చరణ్ ఒక పాటలో తండ్రి చిరుతో కలిసి స్టెప్పేశాడు.

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆచార్య సినిమాకి, ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకి మధ్య డేట్స్ కుదరకనో, లేక ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ నటించినట్లయితే ఈ చిత్రం ఆర్ఆర్ఆర్ సినిమా కంటే ముందు విడుదల అవుతుంది కనుక అలా అవడం వల్ల ఆర్ఆర్ఆర్ సినిమా క్రేజ్ తగ్గుతుందని రాజమౌలి అభ్యంతరం చేశాడంట. కానీ, చిరంజీవి మాత్రం రాజమౌళితో వ్యక్తిగతంగా మాట్లాడారంట. తాము ఇద్దరం కలిసి నటించడం అనేది సురేఖ కోరిక అని, మళ్లీ వారికి ఇలాంటి అవకాశం లభిస్తుందో లేదో తెలియదని చిరు రాజమౌళిని కోరారట. అలా చిరు మాట కాదనలేక ఆయన అభ్యర్థనకు రాజమౌళి ఓకే చెప్పారని టాలీవుడ్ సమాచారం.

Tags :
|

Advertisement