Advertisement

  • బాలయ్య బాబు కు బర్త్ డే విషెస్ చెప్పిన చిరంజీవి

బాలయ్య బాబు కు బర్త్ డే విషెస్ చెప్పిన చిరంజీవి

By: Sankar Wed, 10 June 2020 1:56 PM

బాలయ్య బాబు కు బర్త్ డే విషెస్  చెప్పిన  చిరంజీవి

అరవయ్యో వసంతంలోకి అడుగుపెడుతున్న నటరత్న నందమూరి బాలకృష్ణకు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశారు. ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న బాలయ్య ఆయురారోగ్యాలతో నిండునూరేళ్లూ సంతోషంగా జీవించాలని చిరంజీవి ఆకాంక్షించారు.


`60లోకి అడుగుపెడుతున్న మా బాలకృష్ణకి షష్టిపూర్తి శుభాకాంక్షలు. ఇదే ఉత్సాహంతో, ఉత్తేజంతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ల సంబరం కూడా జరుపుకోవాలని, అందరి అభిమానం ఇలాగే పొందాలని కోరుకుంటున్నాను. డియర్ బాలకృష్ణ.. 60వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మీ అద్భుతమైన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటున్నా. హ్యాపీ బర్త్‌డే` అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు

అలాగే మోహన్ బాబు కూడా బాలకృష్ణ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు ..నా సోదరుని కుమారుడు, నందమూరి బాలకృష్ణ 100 సంవత్సరాలు అష్ట ఐశ్వర్య ఆయురారోగ్యములతో నిండు నూరేళ్ళు పుట్టిన రోజులు జరుపుకోవాలని నా హృదయపూర్వకముగా షిరిడీ సాయినాథుని కోరుకుంటున్నాను ..

Tags :

Advertisement