Advertisement

చిరంజీవి కొత్త లుక్ చూసి అంతా షాక్

By: chandrasekar Mon, 20 July 2020 1:27 PM

చిరంజీవి కొత్త లుక్ చూసి అంతా షాక్


ఎప్పుడూ ఒకే స్టైల్ ‌లో కనిపించే చిరంజీవి అప్పుడప్పుడూ మాత్రం మీసాలు పెంచేసి కొంచెం కొత్తగా కనిపిస్తుంటాడు. కానీ ఇప్పుడు మాత్రం మెగాస్టార్ పూర్తిగా మారిపోయాడు.

ప్రస్తుతం వైరల్ అవుతున్న చిరంజీవి కొత్త లుక్ చూసి అంతా షాక్ అవుతున్నారు. అసలు అక్కడున్నది చిరంజీవేనా కాదా అని సందేహపడ్తున్నారు. బరువు తగ్గిపోయి. మీసాలు తీసేసి కుర్రాడిలా మారిపోయాడు చిరంజీవి. ఈ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

64 ఏళ్ల వయసులో అన్నయ్యను అలా చూసి అభిమానులు సూపర్ అంటూ ఫిదా అయిపోతున్నారు. లాక్‌డౌన్ సమయంలో ఫిజిక్ విషయంలో మరింత కాన్సట్రేషన్ పెట్టాడు మెగాస్టార్.

అందులో భాగంగానే ఎప్పుడూ జిమ్‌లోనే ఎక్కువగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు చిరంజీవి. తాజాగా మెగా లుక్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. బ్లఫ్‌మాస్టర్ దర్శకుడు గోపీ గణేష్ ఈ మధ్యే చిరంజీవిని కలిసాడు.

దాంతో ఆయన పోస్ట్ చేసిన పిక్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అందులో చిరంజీవి మీసాలు తీసేసి కొత్తగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఆచార్యతో బిజీగా ఉన్నాడు చిరంజీవి. ఈ చిత్రం తర్వాత లూసీఫర్ రీమేక్ చేయబోతున్నాడు.

దీనికి సుజీత్ దర్శకుడు. ఇక బాబీతో పాటు మరికొందరు దర్శకులు చెప్పిన కథలను కూడా విన్నాడు చిరంజీవి. మరో మూడు నాలుగేళ్ల వరకు కూడా చిరంజీవి ఫుల్ బిజీగా ఉండబోతున్నారు.


Tags :
|

Advertisement