Advertisement

  • చిరు సర్ నాతో ఆ సీన్ చేయడానికి ఇబ్బంది పడ్డారు....సోను సూద్

చిరు సర్ నాతో ఆ సీన్ చేయడానికి ఇబ్బంది పడ్డారు....సోను సూద్

By: Sankar Sun, 20 Dec 2020 4:36 PM

చిరు సర్ నాతో ఆ సీన్ చేయడానికి ఇబ్బంది పడ్డారు....సోను సూద్


కరోనా కారణంగా ఇబ్బంది పడిన ఎంతో మందికి సాయం అందించిన సోను సూద్ దాతృత్వం దేశ విదేశాల్లో ప్రశంసలు అందుకుంది. వలస కార్మికులను స్వస్థలాలకు చేరుకోవడంలో ఆయన చేసిన కృషి జాతీయ దృష్టిని ఆకర్షించింది. లాక్‌డౌన్‌లో ప్రారంభమైన సోనూసూద్‌ సేవలు నేటికి కొనసాగుతున్నాయి. తను చేసిన సాయాన్ని గుర్తిస్తూ ఎంతోమంది నిర్మాతలు తమ సినిమాల్లో హీరో పాత్రల కోసం అడుగుతున్నారని సోనూసూద్‌ వెల్లడించారు...

అయితే సోను సూద్ వీ ద వుమెన్‌ వర్చువల్‌ సెషన్‌లో మాట్లాడుతూ ఇటీవల నేను ఆచార్య షూట్‌లో పాల్గొన్నాను. చిరంజీవి సార్‌తో కలిసి యాక్షన్‌ కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాం. షూట్‌ సమయంలో చిరంజీవి నా దగ్గరకు వచ్చి నువ్వు ఈ సినిమాలో ఉండటం మాకు పెద్ద సమస్యంగా మారుతోందన్నారు...

ఎంతోమందికి సేవలు అందించి ప్రజల గుండెల్లో నువ్వు మంచి స్థానాన్ని సొంతం చేసుకున్నావు. యాక్షన్‌ సన్నివేశాల్లో నేను నిన్ను కొట్టాలంటే ఇబ్బందిగా అనిపిస్తోంది. ఒకవేళ నిన్ను కొడితే ప్రజలు నన్ను తిట్టుకుంటారు. అలాగే ఓ సన్నివేశంలో చిరంజీవి నాపై కాలు పెట్టాల్సి ఉంటుంది. దాన్ని కూడా రీషూట్‌ చేశాం. అని ఆచార్య షూట్‌ సందర్భాలను గుర్తు చేసుకున్నారు..

Tags :
|
|

Advertisement