Advertisement

  • సూపర్ స్టార్ కృష్ణ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువ

సూపర్ స్టార్ కృష్ణ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువ

By: Sankar Sun, 31 May 2020 12:40 PM

సూపర్ స్టార్ కృష్ణ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువ

నట శేఖరుడు , సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా లో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి ..మెగాస్టార్ చిరంజీవి నుంచి , సుధీర్ బాబు వరకు అందరు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.చిరంజీవి ట్విట్టర్లో , కథానాయకుడిగా 345 సినిమాలు.. దర్శకుడిగా 14 చిత్రాలు. నిర్మాతగా తెలుగుతో పాటు భారతీయభాషల్లో 50 చిత్రాలు. మొదటి సినిమాస్కోప్ సినిమా ఆయనదే. మొదటి 70 ఎమ్‌ఎమ్‌‌ చిత్రం కూడా ఆయనదే. అనితరసాధ్యం ఈ ట్రాక్‌ రికార్డు. సాహసానికి మారుపేరు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత సూపర్‌స్టార్‌ కృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు. అంతేకాకుండా ఆయనతో కలిసి దిగిన ఫోటోను కూడా ట్వీట్‌లో జతచేశారు.

krishna,super star,chiranjeevi,sudheer babu,birthday , సూపర్‌స్టార్‌ , కృష్ణ, చిరంజీవి , సుధీర్ బాబు, బర్త్ డే

కాగా, కృష్ణ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఆయ‌న అల్లుడు సుధీర్ బాబు సరికొత్త స్టైల్‌లో విషెస్ చెప్పారు. కృష్ణ న‌టించిన అల్లూరి సీతారామ‌రాజు చిత్రంలోని ఎమోషన్‌ డైలాగ్‌కు డ‌బ్ స్మాష్ చేసి కాస్త వైవిధ్యంగా జన్మదిన శుభాకాంక్ష‌లు అందించారు. ఎంతో ఉద్వేగభరితంగా ఉన్న ఆ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సుధీర్‌బాబు నటనకు నెటిజన్లు హ్యాట్సాఫ్‌ చెబుతున్నారు. కృష్ణ కోడలు, మహేశ్‌ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్‌ తన మామకు ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కమ్రంలో ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. వీరితో పాటు టాలీవుడ్‌కు చెందిన అనేక మంది ప్రముఖులు సూపర్‌ స్టార్‌ కృష్ణకు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. ఇటు కృష్ణ బర్త్‌డే అటు మహేష్ కొత్త సినిమా ప్రకటనతో సోషల్‌ మీడియాలో దద్దరిల్లిపోతోంది..

Tags :

Advertisement