Advertisement

  • నిహారిక పెళ్లికి ఆహ్వానించబడ్డ సెలెబ్రిటీలు

నిహారిక పెళ్లికి ఆహ్వానించబడ్డ సెలెబ్రిటీలు

By: chandrasekar Sat, 05 Dec 2020 9:27 PM

నిహారిక పెళ్లికి ఆహ్వానించబడ్డ సెలెబ్రిటీలు


మెగాస్టార్ ఫ్యామిలీలో పెళ్లి వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. ఇందుకోసం టాలీవుడ్ లో సెలెబ్రిటీలను పెళ్ళికి వీరు ఆహ్వానించారు. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల తనయ నిహారిక పెళ్లికి మరో నాలుగు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే కుటుంబ సభ్యులు రాజస్థాన్‌లో పెళ్లి వేడుక జరిగే ఉదయపూర్ ప్యాలెస్‌కు చేరుకొని సందడి చేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ తప్ప మిగిలిన కుటుంబ సభ్యులందురు ఉదయపూర్ చేరుకున్నారు. చిరంజీవి రేపు ‘ఆచార్య’ షూటింగ్ తర్వాత డైరెక్ట్‌గా ఉదయపూర్ వెళ్లనున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఆదివారం లేకపోతే సోమవారం ఉదయం ఉదయ్‌పూర్ వెళ్లి మూడు రోజుల పాటు అక్కడే ఉండనున్నాడు. ఇక రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా తమ షూటింగ్‌లో తీరిక చేసుకొని సోమవారం ఉదయం పెళ్లి జరిగే ఉదయ్ పూర్‌‌కుతమ కుటుంబ సభ్యలతో కలిసి చేరుకోనున్నారు. నిహారిక పెళ్లి వేడుకకు సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరెవరకి ఆహ్వానాలు అందయనే దానిపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ నుంచి ఎన్టీఆర్‌‌‌, రాజమౌళిని నాగబాబు, రామ్ చరణ్ ప్రత్యేకంగా ఆహ్వానించినట్టు సమాచారం. మరోవైపు చిరంజీవి నిహారిక పెళ్లి భాధ్యతలను పెదనాన్నగా చిరంజీవి తీసుకున్నారట. కోవిడ్ నియమ నిబంధనల మేరకు కొద్ది మందికే ఆహ్మానం అందినట్టు సమాచారం. తరువాత రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.

ఉదయపూర్ లో జరిగే వివాహ వేడుకలకి సీనియర్ హీరోలైన బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున‌లకు చిరంజీవి ప్రత్యేకంగా ఫోన్ చేసి మరి తన సోదరుడు కూతురు పెళ్లికి రావాలని ఆహ్వానించాడట. మరోవైపు వరుణ్ తేజ్, రామ్ చరణ్, రానా, రామ్, నితిన్, నాగ చైతన్య, సమంత దంపతులతో పాటు పూజా హెగ్డే, రష్మిక మందన్నతో పాటు దర్శకుడు కొరటాల శివ,సీనియర్ దర్శకులైన కోదండరామిరెడ్డి, రాఘవేంద్రరావు‌లకు ఆర్కా మీడియా, మైత్రీ మూవీ మేకర్స్‌ అధినేతలో పాటు అనిల్ సుంకర, దానయ్య, దిల్ రాజు‌తో పాటు, సురేష్ బాబులకు ఆహ్వానాలు అందినట్టు సమాచారం. ఈ పెళ్లి కోసం నాగబాబు కాబోయే అల్లుడికి బాగానే ముట్టజెప్పినట్టు సమాచారం. డైరెక్ట్‌గా పెళ్లి కొడుకుకు కాకుండా నిహారికకు దాదాపు రూ. 10 కోట్ల వరకు లాంఛనం ఇవ్వబోతున్నట్టు సమాచారం. మరోవైపు పెళ్లికి నగలు నట్రా అవన్ని కలిపి మరో రూ. 2 కోట్ల వరకు ఉంటాయనేది సమాచారం. దాంతో పాటు నిహారిక పేరు మీద ఓ బంగ్లాను కూడా అల్లుడికి ఇవ్వబోతున్నట్టు సమాచారం. మొత్తంగా కట్నం ఊసెత్తకుండా నిహారికకు నాగబాబు ఇవన్ని లాంఛనంగా ఇవ్వబోతున్నట్టు మెగా ఫ్యామిలీ వర్గాలు చెబుతున్నాయి. వివాహాన్ని కుటుంబసభ్యులతో బాటు ముఖ్యమైన కొంతమందిని మాత్రమే ఆహ్వానించనున్నట్లు తెలిసింది.

Tags :

Advertisement